భర్త దిల్ రాజుతో వైఘా రెడ్డి తొలి సెల్ఫీ.. వైరల్

తన భర్త దిల్ రాజుతో కలిసి ఆయన రెండో భార్య వైఘా రెడ్డి (తేజస్విని) సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఆ సెల్ఫీ (Dil Raju Second Wife) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Written by - Shankar Dukanam | Last Updated : May 13, 2020, 10:11 AM IST
భర్త దిల్ రాజుతో వైఘా రెడ్డి తొలి సెల్ఫీ.. వైరల్

Dil Raju Second Wife | ఆదివారం నుంచి గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం. లేటు వయసులో ఆయన రెండో వివాహం చేసుకోవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. తేజస్విని (వైఘా రెడ్డి) అనే బ్రాహ్మణ యువతిని దిల్ రాజు కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి మధ్య వయసు వ్యత్యాసం చాలానే ఉంటుందన్న చర్చ సైతం నడిచింది. Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

నిజామాబాద్‌లోని తన స్వస్థలం నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో దిల్ రాజు, వైఘా రెడ్డి వివాహం కొందరు సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత భర్త దిల్ రాజతో కలిసి వైఘా రెడ్డి దిగిన సెల్ఫీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీని దిల్ రాజు భార్య క్లిక్‌మనిపించారు. తొలి అనేది ఎప్పటికీ ఎంతగా ఆదరణ పొందుతుందో చెప్పలేము. ఆ కోవలోకే వస్తుంది తేజస్విని, దిల్ రాజుల తొలి సెల్ఫీ. Mothers Day: దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు

దిల్ రాజు రెండో భార్య అసలు పేరు తేజస్విని కాగా, ఆయనకు కలిసొచ్చేలా జ్యోతిష్కుడు సూచించినట్లుగా ఆమె పేరుగా వైఘా రెడ్డిగా మార్చడం తెలిసిందే. ఆమె గతంలో ఎయిర్ హోస్టెస్‌గా చేశారని, వీరి కుటుంబాలకు పరిచయం ఉందని తెలుస్తోంది. దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి ‘మదర్స్ డే’ రోజు తల్లిని అందించి నిర్మాతకు తోడును అందించారు. దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!        జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News