బాలీవుడ్ స్టార్ లవ్ కపుల్ దీపికా పదుకునె, రణ్వీర్ సింగ్ల పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఈ జంట తమ పెళ్లి వార్తను అధికారికంగా మీడియాకు తెలిపింది. అప్పటి నుంచి బాలీవుడ్లో దీప్-వీర్ పెళ్లి ఓ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. నవంబర్ 14,15 తేదీల్లో వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ పెళ్లి విశేషాల గురించి దీపికా పదుకునె ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ''తాను తన తర్వాతి సినిమాకు సైన్ చేసినప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతానో... తన పెళ్లి గురించి కూడా అంతే ఎగ్టైట్ అవుతున్నాను'' అని చెప్పుకొచ్చింది. ఎంతైనా సక్సెస్పుల్ హీరోయిన్ కదా... అందుకే తన పెళ్లిని కూడా ఓ సినిమాకు సైన్ చేయడంతోనే పోల్చిచెప్పిందామె.
పెళ్లి తర్వాత లైఫ్ గురించి మాట్లాడుతూ.. పెళ్లికి ముందు తన జీవితం ఎలా ఉందో, పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నానని దీపికా అభిప్రాయపడింది. దీపికా-రణ్వీర్ సింగ్ల పెళ్లి తేదీ వివరాలు అయితే తెలిశాయి కానీ ఆ పెళ్లికి వేదిక ఎక్కడనే వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉన్నాయి. అయితే, దీపికా, రణ్వీర్ సింగ్లకి ఇష్టమైన ఇటలీలోని లేక్ కొమో ఈ పెళ్లికి వేదిక అయ్యే అవకాశాలున్నాయని ఆ ఇద్దరికీ సన్నిహితంగా మెదిలే స్నేహితులు చెబుతున్నారు.