Cow vs Man: గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తిపై పగ తీర్చుకున్న ఆవు!

Viral Video, Man kicked Cow with Foot, See What happen next. తనను కాలితో తన్నిన వ్యక్తిపై.. ఆవు కసితీరా పగ తీర్చుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - P Sampath Kumar | Last Updated : Oct 17, 2022, 01:10 PM IST
  • గెలికితే ఊరుకుంటుందా
  • వ్యక్తిపై పగ తీర్చుకున్న ఆవు (వీడియో)!
  • కిందపడినా కూడా వదలలేదు
Cow vs Man: గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తిపై పగ తీర్చుకున్న ఆవు!

Man kicked Cow with Foot See What happen next: భారతదేశంలోని హిందువులు ఆవులను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు కూడా. కొత్తగా గృహ ప్రవేశం చేసేవారు ఆవును ఇంట్లో తిప్పుతారు. అంతేకాదు వీదుల్లో తిరిగే ఆవు ఇంటి గేటు ముందు ఆగినా.. దానికి ఆహరం పెట్టి మరీ పంపిస్తారు. అయితే ఎప్పుడూ శాంతంగా కనిపించే ఆవు.. దాన్ని ఎమన్నా అంటే మాత్రం ఊరుకోదు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన్నాడు తన్నిన మనిషిని కసితీరా పొడిచింది. 

వీడియో ప్రకారం... ఆవును ఓ వ్యక్తి తాడుతో కట్టేసి ముందుకు లాగుతుంటాడు. అప్పుడు ఆ ఆవు అక్కడి నుంచి కదలదు. దాంతో మరొక వ్యక్తి ఆవును తంతాడు. ఆవును గట్టిగా తన్నిన తర్వాత.. ఆ వ్యక్తి తన చేతిలోకి తోకను తీసుకుని బలంగా తిప్పాడు. అప్పుడు ఆవు రెండడుగులు ముందుకేసి.. కోపంతో రగిలిపోతుంది. వెనకాలకు తిరిగి.. ఆ వ్యక్తిపై దాడి చేస్తుంది. కిందపడినా కూడా వదలదు. అతడిని పొడుస్తుంది. దాంతో ఆ వ్యక్తి కేకలు వేస్తాడు. 

ఇందుకు సంబందించిన వీడియోను 'ఘర్కేకలేష్' (r/Ghar Ke Kalesh) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'గెలికితే ఊరుకుంటుందా మరి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బాగా అయింది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. మనిషిపై పగ తీర్చుకున్న ఆవు, ఆవు భలే పని చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

Also Read: అతిభయంకరమైన రెడ్ కింగ్ కోబ్రాను ఎప్పుడైనా చూసారా.. లేదంటే ఈ వీడియో చూడండి!

Also Read: 7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 4 శాతం పెరిగిన డీఏ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News