కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి

కరోనా వైరస్ లాంటి మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నా కొందరు నెటిజన్లు తమకు తెలియని, అవాస్తవాలను పోస్ట్ చేస్తున్నారు.

Last Updated : Mar 26, 2020, 06:35 PM IST
కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి

సాధారణంగానే సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతుంటాయి. అయితే కరోనా వైరస్ లాంటి మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నా కొందరు నెటిజన్లు తమకు తెలియని, అవాస్తవాలను పోస్ట్ చేయగా.. అది నిజమనుకుని మరికొందరు షేర్ చేయడంలో ఆ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏవి సత్యాలు, ఏవి అసత్యాలో తేల్చుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వదంతులు, అందులో నిజనిజాలను ఇక్కడ అందిస్తున్నాం..

వదంతులు 1) గొంతు తేమగా (తడిగా) ఉండేట్లు చూసుకుంటే కరోనా వైరస్ సోకదు
నిజం: శాస్త్రీయంగా దీనికి ఏ ఆధారం లేదు. డాక్టర్లు దీన్ని సూచించలేదు. ఇలాంటివి నమ్మవద్దు.

వదంతులు 2) విటమిన్ సీ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో కరోనా ఇన్‌ఫెక్షన్ బారి నుండి బయటపడొచ్చు
నిజం: క్రమం తప్పకుండా విటమిన్ సి పదార్థాలు తీసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మరీ ఎక్కువగా విటమిన్ సి పండ్లు, పదార్థాలు తీసుకోకపోవడమే ఉత్తమం.

వదంతులు 3) 10 సెకన్లపాటు శ్వాసతీసుకోకుండా ఉండాలి. ఏ ఇబ్బంది తలెత్తకపోతే మీకు కోవిడ్19 (CoronaVirus) వైరస్ సోకనట్టే.
నిజం: పది సెకన్లపాటు శ్వాస తీసుకోవడం ఆపిస్తే.. ఇబ్బంది తలెత్తకపోయినంత  మాత్రాన కరోనా వైరస్ లేదని నిర్ధారణకు రావొద్దు. శాస్త్రీయంగా ఎవరూ చెప్పలేదు.   కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్

వదంతులు 4) మలేరియా నివారణలో వాడే క్లోరోక్విన్ లేక హైడ్రోక్లోరోక్లిన్ కోవిడ్19 నివారణకు తోడ్పడుతుంది.
నిజం: ఇందులో నిజం లేదు. కరోనా పేషెంట్‌కు క్లోరోక్విన్, హైడ్రోక్లోరోక్లిన్ వాడాలా వద్దా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాక ప్రకటించింది. సొంతంగా నిర్ణయాలు తీసుకుని వీటిని వాడవద్దు.

వదంతులు 5) జ్యూస్ తాగడంతో కోవిడ్19ని అరికట్టవచ్చునని ఓ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
నిజం: ఇది అవాస్తవం. ఇలాంటి చికిత్స విధానమే లేదని వైద్యులు చెబుతున్నారు.

వదంతులు 6) పారాసెటమల్ ట్యాబ్లెట్‌తో కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు ట్రీట్ మెంట్
నిజం: పారాసెటమల్‌‌తో జ్వరం తగ్గుతుంది. కరోనా వైరస్ చికిత్సకు పారాసెటమల్ సరైంది కాదు. ఈ ట్యాబ్లెట్‌ను సైతం డాక్టర్ల సలహా మేరకు వేసుకోవడం మంచింది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News