Niharika Konidela Divorce: ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!

Chaitanya Jonnalagadda - Niharika Divorce నిహారిక చైతన్యల విడాకులు కూడా జరగబోతోన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని సంఘటనలు చూస్తుంటే విడాకుల వ్యవహారం నిజమేనేమో? అనే అనుమానాలు కలిగించేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 12:20 PM IST
  • నెట్టింట్లో కొత్త చర్చ
  • మెగా ఇంట్లో మరో డివోర్స్?
  • నిహారిక ఫోటోలు తీసేసిన చైతన్య..
Niharika Konidela Divorce: ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!

Chaitanya Deleted Niharika Konidela Pics మెగా ఇంట్లో విడాకుల వ్యవహారాలు కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ విషయంలో రెండు సార్లు విడాకులు జరిగాయి. శ్రీజ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఆమె రెండో పెళ్లి సైతం పెటాకులైనట్టు సమాచారం. గత ఏడాది నుంచి కళ్యాణ్‌ దేవ్ శ్రీజలు దూరంగానే ఉంటున్నారు. ఈ ఇద్దరి విడాకుల రూమర్లు టాలీవుడ్ అంతటా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిహారిక చైతన్య జొన్నలగడ్డ విడాకుల రూమర్లు తెరపైకి వచ్చాయి.

నిహారిక, చైతన్యలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి ఎప్పుడూ వెకేషన్స్, పార్టీలంటూ తిరుగుతూనే ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ జంట సైలెంట్ అయింది. ఇద్దరూ కలిసి తిరిగినట్టుగా కనిపించడం లేదు. సింగిల్‌గానే ఫోటోలను షేర్ చేస్తున్నారు. దీంతో ఈ జంట విడాకుల మీద రూమర్లు వచ్చాయి. గతంలోనూ ఇలానే రూమర్లు వచ్చాయి. కానీ అప్పుడు వెంటనే చైతన్య.. తన ఇన్ స్టా స్టోరీలో నిహారికతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. అలా రూమర్లకు పుల్ స్టాప్ పెట్టాడు.

కానీ ఇప్పుడు ఈ రూమర్లకు కారణం అయిందే చైతన్య. అతను తన ఇన్ స్టాగ్రాంలో పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు. అసలు నిహారికతో ఉన్న ఫోటోలన్నింటిని డిలీట్ చేశాడు. నిహారిక ఫోటోలు చైతన్య అకౌంట్లో కనిపించడం లేదు. కానీ చైతన్యతో ఉన్న ఫోటోలను నిహారిక ఖాతాలో ఇంకా ఉంచేసుకుంది. అన్ని ఫోటోలను డిలీట్ చేసిన చైతన్య.. ఒక్క ఫోటోను మాత్రం ఉంచాడు. అది మరిచిపోయి అలా ఉంచేశాడా? కావాలనే ఉంచాడా? అన్నది తెలియడం లేదు.

 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)

పెళ్లి తరువాత నిహారిక పుట్టిన రోజుకు ఓ పెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు చైతన్య. దాని పేరు బజ్ అని పెట్టారు. ఈ బజ్‌ గురించి ఎన్నో విషయాలు నిహారిక, చైతన్యలు చెబుతూనే ఉండేవారు. ఇప్పుడు బజ్‌తో నిహారిక ఉన్న ఫోటోను మాత్రమే చైతన్య డిలీట్ చేయకుండా ఉన్నాడు. అయితే ఆ పెట్‌ కోసం ఆ ఫోటో ఉంచాడా? లేదా నిహారిక కోసమా? లేదంటే మరిచిపోయి ఉంచాడా? అన్నది క్లారిటీ లేదు. అసలు వీరి విడాకుల రూమర్లపై ఇంత వరకు ఎవ్వరూ స్పందించలేదు. ఖండించలేదు. నిహారిక, చైతన్యలు అధికారికంగా స్పందిస్తారా? అన్నది చూడాలి.

Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్

Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News