బిగ్ బాస్ షో వ్యాఖ్యాతగా నాని?

తెలుగులో గతేడాది ప్రారంభమైన బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Last Updated : Mar 18, 2018, 02:51 PM IST
బిగ్ బాస్ షో వ్యాఖ్యాతగా నాని?

తెలుగులో గతేడాది ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభించింది. షో క్రెడిట్ అంతా ఎన్టీఆర్‌‌దే అనడంలో సందేహం లేదు. అయితే, ఈ ఏడాది వ్యక్తిగత, వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ కారణంగా ఎన్టీఆర్  షో నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో బిగ్ బాస్ షో రెండవ సీజన్ వ్యాఖ్యాత కొరకు చాలా మంది హీరోలు పోటీపడ్డారు. ముఖ్యంగా అల్లు అర్జున్, నాని, రానా, రాంచరణ్ తేజ్ లాంటి హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అల్లు అర్జున్ పేరు దాదాపుగా ఖరారు అయిందనే వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ తాజాగా నాని పేరు రియాలిటీ షోకి ఖరారు అయ్యిందని టాక్.  షో నిర్వహించే ఛానెల్ త్వరలోనే అధికారిక ప్రకటనను విడుదల చేయనుందని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ వల్ల షో హిట్ అయ్యింది. అతని స్థానంలో నాని అయితేనే కరెక్ట్ అని షో యాజమాన్యం భావించిందని నివేదికలు తెలిపాయి. యాంకర్ స్పాంటేనియస్ అయి ఉండాలి. అది నానిలో ఉంది. నాని రేడియో జాకీగా కెరీర్ ఆరంభించాడు. ఆ అనుభవం బిగ్ బాస్‌కు పనికొస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. నేచురల్ స్టార్ గత అనుభవంతో పాటు.. ప్రస్తుత నటన, పాపులరిటీ షోకు ఉపయోగపడుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు అనుకుంటున్నారు.  బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 2కి నాని రీజనబుల్ రెమ్యునరేషనే అడిగినట్లు సమాచారం.

Trending News