వీడియో: రాహుల్ మెడలో.. ఎగిరొచ్చి పడిన పూలమాల..!

కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తుముకూరు ప్రాంతంలో కూడా భారీస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

Last Updated : Apr 6, 2018, 02:04 PM IST
వీడియో: రాహుల్ మెడలో.. ఎగిరొచ్చి పడిన పూలమాల..!

కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తుముకూరు ప్రాంతంలో కూడా భారీస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి ఓ ప్రచార కార్యక్రమంలో ఓ విచిత్రం జరిగింది. ఎవరో కాంగ్రెస్ అభిమాని గుంపులో నుండి విసిరిన దండ ఎగిరొచ్చి.. రాహుల్ గాంధీ మెడలో పడడం అందరినీ ఆశ్యర్యపరిచింది.

సడెన్‌గా దండ వచ్చి తన మెడలో పడడంతో రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకొని తన భద్రతా సిబ్బందికి ఆ దండను అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ నేత రక్షిత్ శివరామ్ ఈ వీడియోను ఇటీవలే తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దండను భలే విసిరాడని ఇప్పటికే నెటిజన్లు ఆ అభిమానిని మెచ్చుకుంటూ ఉండగా.. ఇది కచ్చితంగా భద్రతా ఉల్లంఘన క్రిందకు వస్తుందని కూడా పలువురు అంటున్నారు

 

Trending News