త్రివిక్రమ్ ఆ సీన్ తీసేయడం నన్ను చాలా బాధ కలిగించింది : ఆదర్శ్ బాలకృష్ణ

తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్ 1' ద్వారా ఆదర్శ్ బాలకృష్ణ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. 'బిస్ బాస్' సీజన్ 1 ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ తో ఆయనకి తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నాడు.

Last Updated : Jan 10, 2020, 03:13 PM IST
త్రివిక్రమ్ ఆ సీన్ తీసేయడం నన్ను చాలా బాధ కలిగించింది : ఆదర్శ్ బాలకృష్ణ

హైదరాబాద్ : తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్ 1' ద్వారా ఆదర్శ్ బాలకృష్ణ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. 'బిస్ బాస్' సీజన్ 1 ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ తో ఆయనకి తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గతంలో చేసిన 'అరవింద సమేత' గురించి ప్రస్తావించాడు. "త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో 'అరవింద సమేత'లో నటించాను. అయితే నేను చేసిన సీన్ ను ఫైనల్ ఎడిటింగ్ లో లేపేశారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో నేను చేసిన ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సీన్ లేపేయడం నాకు చాలా బాధాను కలిగించింది. త్రివిక్రమ్ గారి దగ్గర కూడా నా ఆవేదనను వ్యక్తం చేశాను. తరువాత సినిమాల్లో ఆయన నాకు మంచి పాత్రను ఇస్తారనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News