దివంగత నటి శ్రీదేవి నటనే కాదు..చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. చిత్రలేఖనాన్ని తెగ ఇష్టపడే ఆమె..తీరిక దొరినప్పుడు పెయింటింగ్స్ వేసేదట. అలా తాను గీసిన పెయింటింగ్స్ ను తన బంధువులకు ..సన్నిహితులకు గిఫ్ట్ గా ఇచ్చేదట. శ్రీదేవి నుంచి తీసుకున్న పెయింటింగ్స్ ను వాళ్లంతా అపురూపంగా చూసుకుంటూ భద్రపరుస్తూ వచ్చారు.
శ్రీదేవి హఠాత్తుగా మరణించడం..గ్లామర్ పరంగా ప్రేక్షకుల హృదయాలపై ఆమె వేసిన ముద్రను అంతతేలికగా ఎవరూ మరిచిపోలేరు. ఈ నేఫథ్యంలో ఆమెకు వేసిన పెయింటింగ్స్ లో తన ఇంట్లో వున్నవి..బంధువులు, సన్నిహితుల దగ్గర ఉన్నవి సేకరించి ఆమె జ్ఞాపకార్థంగా ముంబైలో ఒక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారట.
గతంలో శ్రీదేవి స్వయంగా వేసిన ఓ పెయింటింగ్‌ను లండన్‌లోని ప్రతిష్ఠాత్మక క్రిస్టీలో వేలానికి ఉంచగా.. ఓ వ్యక్తి రూ. 22 లక్షలు చెల్లించి దానిని కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీదేవి పెయింటింగ్స్ తిలకించేందుకు అభిమానలు ఆశగా ఎదురుచూస్తున్నారు.