సాధారణంగా సినీ స్టార్ల వారసులందరూ చిత్ర పరిశ్రమలోనే తమ కెరీర్ ఉందని భావిస్తారు. వారు కూడా సూపర్ స్టార్లు అవ్వాలని అనుకుంటారు. కానీ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కొడుకు అబ్రామ్ మాత్రం వేరే విషయాలపై ఆసక్తి పెంచుకుంటున్నాడట. ఇటీవలే ఐపీఎల్ వేడుకలకు తన తండ్రి షారుఖ్‌తో సహా హాజరయ్యాడు అబ్రామ్. అప్పుడు ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.
"మీ కొడుకుని నటుడిగా చూడాలనుకుంటున్నారా లేదా క్రికెటర్‌గా చూడాలని భావిస్తున్నారా" అని అడిగితే షారుఖ్ ఇలా అన్నాడు. "అబ్రామ్‌కి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. అంతకు మించి ఫీల్డ్ హాకీ కూడా బాగా ఆడుతుంటాడు. అందుకే నేను తనను హాకీలో ఇండియా టీమ్‌కి ఆడితే సంతోషిస్తాను" అన్నాడట. ఇటీవలే తన తండ్రితో కలిసి ఆల్ప్స్ శిఖరాలు చూడడానికి వెళ్లినప్పుడు స్కీయింగ్ పోటీలలో పాల్గొని అబ్రామ్ మెడల్ కూడా తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని కూడా చాలా గర్వంగా చెప్పారు షారుఖ్.
చిత్రమేంటంటే.. చక్ దే చిత్రంలో షారుఖ్ కూడా హాకీ కోచ్ పాత్రే పోషించారు. అలాగే తన కుమారుడు కూడా క్రీడాకారుడు అవ్వాలని ఆశపడుతున్నారు. ప్రస్తుతం షారుఖ్ "జీరో" చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఇందులో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చంద్రమండలానికి వెళ్లిన తొలి భారతీయుడైన రాకేష్ శర్మ జీవితం ఆధారంగా తీయబోయే చిత్రంలో కూడా నటిస్తున్నారు షారుఖ్.
అలాగే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును కూడా బాగానే లీడ్ చేస్తున్నారు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్. ఇంత బిజీగా ఉండి కూడా తన కొడుకు అబ్రామ్ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అయితే.. ఇందులో తన ప్రమేయం ఏమీ ఉండదని.. తాను ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలన్నది అతని ఇష్టమని తెలిపారు షారుఖ్