Cobra Vs Mongoose Fighting: బ్లాక్ కోబ్రా, ముంగిస మధ్య భీకర పోరు .. చివరకు ఏది గెలిచిందో తెలుసా..?

Mongoose kills Black Cobra in Forest: ఓ కాలువలో బ్లాక్ కోబ్రా, ముంగిస ఎదురుపడతాయి. కింగ్ కోబ్రాను చూసిన ముంగిస వెంటనే దాడి చేస్తుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 27, 2022, 02:35 PM IST
  • బ్లాక్ కోబ్రా, ముంగిస మధ్య భీకర ఫైట్
  • ఏది గెలిచిందో తెలుసా?
  • వీడియోకి 2,781,961 వ్యూస్
Cobra Vs Mongoose Fighting: బ్లాక్ కోబ్రా, ముంగిస మధ్య భీకర పోరు .. చివరకు ఏది గెలిచిందో తెలుసా..?

Mongoose attacks and kills Black Cobra in Forest: నాగుపాము, ముంగిస కడానికిమరొకటి బద్ద శత్రువులు అన్న విషయం తెలిసిందే. ఈ రెండు ఎప్పుడు ఎదురుపడినా భీకర ఫైట్ తప్పదు. ఈ పోరులో గెలుపు ఎవరిది అని చెప్పడం మాత్రం కాస్త కష్టమే. నాగుపాము, ముంగిస మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. ఈ పోరులో ఎక్కువగా ముంగిసే పైచేయి సాధించినా.. పెద్దపెద్ద పాములు మాత్రమే అప్పుడప్పుడు విజయం సాధిస్తాయి. తాజాగా ఓ భారీ నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైట్ జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతొంది. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ కాలువలో బ్లాక్ కింగ్ కోబ్రా, ముంగిస ఎదురుపడతాయి. కింగ్ కోబ్రాను చూసిన ముంగిస వెంటనే దాడి చేస్తుంది. దాంతో రెండిటి మధ్య ఫైట్ మొదలవుతుంది. బ్లాక్ కింగ్ కోబ్రా, ముంగిస పైచేయి సాధించే క్రమంలో రెండిటి మధ్య ఫైట్ భీకరంగా మారుతుంది. ఓసారి ముంగిసపై కింగ్ కోబ్రా దాడి చేస్తే.. ఇంకోసారి కింగ్ కోబ్రాపై ముంగిస దాడి చేస్తుంది. ఓ సమయంలో కింగ్ కోబ్రా తలను ముంగిస పట్టుకోవడంతో.. అది విలవిల లాడిపోతుంది. చివరికి ఎలాగోలా తప్పించుకుని ఎదురుదాడి చేస్తుంది. 

ముంగిసను బ్లాక్ కింగ్ కోబ్రా చాలాసార్లు కాటేసినా అది వెనక్కి తగ్గదు. ముంగిస చాలాసార్లు కింగ్ కోబ్రా తలను కొరకడంతో అది నిస్సాయక స్థితిలోకి వెళుతుంది. అయినా కూడా ముంగిసపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ముంగిస దాడిని తట్టుకోలేని పాము పారిపోవడానికి ప్రయత్నించినా కుదరదు. చివరకు బ్లాక్ కింగ్ కోబ్రా చనిపోతుంది. ముంగిస కూడా లేవడానికి ఇబ్బంది పడుతుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News