జూన్ 10..వంద రోజులు..16 మంది సెలబ్రిటీలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో మళ్లీ వచ్చేస్తోంది.

Last Updated : Jun 2, 2018, 01:01 PM IST
జూన్ 10..వంద రోజులు..16 మంది సెలబ్రిటీలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో మళ్లీ వచ్చేస్తోంది. జూన్ 10 నుంచి బిగ్ బాస్ షో స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఈ విషయాన్ని తెల్పుతూ హైదరాబాద్‌లో స్టార్ మా ఇప్పటికే పలుచోట్ల హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తోంది. బిగ్ బాస్2 షో వ్యాఖ్యాతగా ఎంపికైన నాని కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు తెలిపాడు. ‘జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. ఒక బిగ్ హౌస్’ అంటూ తను ఈల వేస్తున్న ఫొటోతో నాని ట్వీట్ చేశాడు.

 

‘బిగ్‌ బాస్’ సీజన్ 2 జూన్ 10 నుంచి మొదలవుతుంది. ఈ షో 100 రోజులపాటు వినోదాన్ని పంచనుంది. మొత్తం 16 మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనబోతున్నారు. ఈ షో స్టార్ మాలో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు.. అలాగే సోమ, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఇంత వరకూ షోకు ఎంపికైన సెలబ్రిటీల పేర్లు బయటపెట్టలేదు. ట్విట్టర్ ద్వారా కంటిస్టెంట్‌ని పరిచయం చేస్తారా.. లేక షోలోనే పరిచయం చేస్తారా అనేది చూడాలి మరి.

ఛార్మీ, గీతా మాధురి, యాంకర్ శ్యామల, రాశీ, లాస్య, గజాలా, చాందినీ చౌదరి, జూ.శ్రీదేవి, ధన్య బాలకృష్ణ, తరుణ్, వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేష్, హాస్య నటుడు వేణు, వైవా హర్ష, తనీష్, శ్రీరెడ్డి.. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంటారని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 16 జులై 2017న ప్రారంభమైన బిగ్ బాస్1.. 70రోజుల పాటు సాగి 24 సెప్టెంబర్ 2017న ముగిసింది. మొత్తం 16 సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షోలో శివ బాలాజీ విజేతగా నిలవగా, రన్నరప్‌గా ఆదర్శ్ నిలిచాడు. విజేతకు 50లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు.

Trending News