బిగ్‌బాస్ 2లో సామాన్యులకూ అవకాశం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో సెలబ్రెటీలే కాదు.. సామాన్యులూ పాల్గొనవచ్చు. 

Last Updated : May 4, 2018, 03:08 PM IST
బిగ్‌బాస్ 2లో సామాన్యులకూ అవకాశం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో సెలబ్రెటీలే కాదు.. సామాన్యులూ పాల్గొనవచ్చు. ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేసిన తెలుగు రియాలిటి షో బిగ్ బాస్‌. ఎన్టీఆర్ ఈ షోతో బుల్లితెర‌కి పరిచయమయ్యాడు. బిగ్ బాస్ 1లో తారక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. తారక్ కంటెస్టెంట్‌ల‌ని డీల్ చేసిన విధానం బుల్లితెర ప్రేక్షకుల‌కి ఎంత‌గానో న‌చ్చేసింది.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. త్వర‌లోనే సీజ‌న్‌ 2 మొద‌లు కానుండ‌గా, దీనికి నానిని హోస్ట్‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నారు. సెకండ్ సీజ‌న్ కోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్ వేసి షూటింగ్ జ‌ర‌ప‌నున్నార‌ని టాక్‌. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 2కి సంబంధించి స్మాల్ ప్రోమో విడుద‌ల చేశారు నిర్వాహ‌కులు. ఇందులో సీజ‌న్ 1 కంటెస్ట్ అయిన దీక్షా పంథ్ సామాన్యుల‌కి పాఠాలు చెబుతున్నట్టుగా ఉంది. సామాన్యులు కూడా సీజ‌న్ 2లో పాల్గొనవచ్చని వీడియో ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వర‌లోనే వెల్లడికానున్నాయి.

Trending News