రిసార్టులో హీరోయిన్‌ పై హీరో దాడి..!

పవన్ సింగ్.. భోజ్‌పూరిలో ఆయన పెద్ద హీరో. కానీ పదే పదే వివాదాల్లో నిలవడంలో కూడా తనకు తానే సాటి. ఇటీవలే తనతో పాటు సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌ని రిస్టార్టుకి తాగేసి వచ్చి చాలా దారుణంగా కొట్టాడు.

Last Updated : Apr 2, 2018, 04:41 PM IST
రిసార్టులో హీరోయిన్‌ పై హీరో దాడి..!

పవన్ సింగ్.. భోజ్‌పూరిలో ఆయన పెద్ద హీరో. కానీ పదే పదే వివాదాల్లో నిలవడంలో కూడా తనకు తానే సాటి. ఇటీవలే తనతో పాటు సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌ని రిసార్టుకి తాగేసి వచ్చి చాలా దారుణంగా కొట్టాడు. తలను గోడకేసి బాదాడు. హీరోయిన్ అరుపులకు రిసార్టు సిబ్బంది వచ్చి పవన్‌ను ఆపుదామని ప్రయత్నిస్తే.. వారిని కూడా పచ్చి బూతులు తిడుతూ కొట్టేందుకు ప్రయత్నించాడు.

భయపడిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి 11.30 గంటలకు డామన్ గంగా వ్యాలి రిసార్టులో ఈ సంఘటన జరిగినట్లు ప్రముఖ సినీ పాత్రికేయులు శశికాంత్ సింగ్ తన ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు. అయితే పవన్ తాగేసి ఉండడం వల్లే.. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడని ఆయన సిబ్బంది తెలపడం గమనార్హం.

ప్రస్తుతం పవన్ కొట్టిన హీరోయిన్‌‌తోనే గతంలో ఆయన డేటింగ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు అంతకు ముందే ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్యోతి సింగ్ అనే ఆమెతో వివాహమైంది. ప్రస్తుతం భోజ్‌పూరిలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కథానాయకుల్లో పవన్ సింగ్ కూడా ఒకరు. బాలీవుడ్ సినిమా పేర్లతో వచ్చే భోజ్ పూరీ సినిమాల్లో ఆయన నటిస్తుంటారు. గతంలో సత్య, సర్కార్ రాజ్, త్రిదేవ్, గద్దర్, అర్జున్ పండిట్, సంగ్రామ్ లాంటి హిందీ సినిమా పేర్లతో వచ్చిన భోజ్ పూరీ చిత్రాల్లో పవన్ సింగ్ నటించారు. తాజాగా హీరోయిన్‌ను కొట్టిన ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Trending News