మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా మహేశ్ ఆకట్టుకున్నాడు. కైరా అద్వానీ నాయికగా నటించిన ఈ సినిమా రన్ టైం మూడు గంటలు దాటడంతో ఎడిటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలను డిలీట్ చేశారు. తాజాగా నిర్మాతలు డిలీటెడ్ సీన్స్ వీడియోలని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీన్స్ సోషల్ మీడియాలో అభిమానులని అలరిస్తున్నాయి. మీరు కూడా చూసేయండి.
ఈ సినిమాలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి ఓ హైలెట్ సీన్.. దానికి కంటిన్యూషన్‌గా మరో సీన్ కూడా ఉంటుంది. టాప్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ సీఎం భరత్‌ను కలవడానికి వస్తాయి. అప్పుడు సీఎం భరత్ ఎలా స్పందిస్తారు? అనేది ఆ సీన్‌లో చూపించారు. ఇక మరో సీన్ అసెంబ్లీది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎందుకు ఆలస్యమైందో సీఎం భరత్ వివరిస్తారు. ఈ నేపథ్యంలో సాగే సంభాషణలు, భరత్ వివరణ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.