Back Pain Relief in 8 Days: నడుము నొప్పితో బాధపడుతున్నారా..? ఈ 3 యోగాసనాలతో 8 రోజుల్లో అన్ని నొప్పులు మటుమాయం!

Back Pain Relief Exercises: ప్రస్తుతం చాలా మంది నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఈ కింద పేర్కోన్న 3 పోస్‌లు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 12:10 PM IST
Back Pain Relief in 8 Days: నడుము నొప్పితో బాధపడుతున్నారా..? ఈ 3 యోగాసనాలతో 8 రోజుల్లో అన్ని నొప్పులు మటుమాయం!

Relief from Back Pain in 8 Days: ప్రస్తుతం వెన్నునొప్పి చాలా సాధారణమైంది. ఇప్పుడు ఈ నొప్పులు వయస్సుకు సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు 60 సంవత్సరాలు నిండిన వారిలో వచ్చేవి కాని ఇప్పుడు చాలా మందిలో చిన్నవయస్సులోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నడుము నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల కూడా ఈ నొప్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కుర్చిల్లో కూర్చోవడం వల్ల కూడా లోయర్ బ్యాక్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా కూడా ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

మార్జోరీ ఆసనం(క్యాట్ పోస్):
దశ 1: మీ మోకాలు, చేతులపై, మీ మణికట్టును మీ భుజాల క్రింద, మీ మోకాళ్ళను మీ తుంటి క్రింద ఉంచండి.
దశ 2: ఇప్పుడు పొత్తికడుపును యోగా మ్యాట్ వైపుకు నెట్టండి. మీ ఛాతీ, గడ్డం ఎత్తండి, దీంతో పాటు మీ శరీరాన్ని పైకి ఎత్తండి.
దశ 3: ఊపిరి వదులుతూ మీ పొత్తికడుపును పైకెత్తి, మీ వెన్నెముక వైపుకు నెట్టండి.
దశ 4: గాలిని ముక్కు ద్వారా పీల్చుకోండి.

మార్జోరీ ఆసనం

బాలాసనం:
దశ 1: మీ కాలి వేళ్లను చూపిస్తూ, మీ మోకాళ్లను హిప్ వెడల్పుతో నేలపై పర్చుకోవాలి.
దశ 2: శ్వాస వదులుతూ, మీ మోకాళ్ల మధ్య మీ మొండేన్ని క్రిందికి దించండి.
దశ 3: మీ చేతులను ముందుకి, అరచేతులను క్రిందికి విస్తరించండి.
దశ 4: మీ భుజాలను రిలాక్స్ చేసి పట్టుకోండి.

బాలాసనం

పెల్విక్ పోస్‌:
దశ 1: మీ మోకాళ్లను వంచి నేలపై వెనుకభాగంలో పడుకోండి.
దశ 2: కండరాలను రిలాక్స్‌ చేసి, నేలపై మీ వీపును నిఠారుగా ఉంచండి.
దశ 3: మీ పెల్విస్‌ను కొద్దిగా పైకి లేపి 10 సెకన్ల పాటు పట్టుకోండి.
దశ 4: ఇలా రోజూ 5 నుంచి 6 సార్లు చేయాలి.

పెల్విక్ పోస్‌

Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం

Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News