బాహుబలి @ 365 రోజులు

ఎస్ ఎస్ రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. 2016లో ఆయన తీసిన ‘బాహుబలి: బిగినింగ్‌’ సినిమాకు ద్వితీయార్థం ఈ చిత్రం. 

Last Updated : Apr 28, 2018, 06:37 PM IST
బాహుబలి @ 365 రోజులు

ఎస్ ఎస్ రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. 2016లో ఆయన తీసిన ‘బాహుబలి: బిగినింగ్‌’ సినిమాకు ద్వితీయార్థం ఈ చిత్రం. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ ప్రపంచానికే భారతీయ సినిమా సత్తా చూపించిన విజువల్ వండర్ ‘బాహుబలి‌’ అనడంలో అతిశయోక్తి లేదు.

ఏప్రిల్‌ 28, 2017 తేదిన ప్రపంచ వ్యాప్తంగా అనేక థియేటర్లలో విడుదలైన ఈ సెల్యూలాయిడ్ వండర్ అశేష ప్రజావాహిని ఆదరణ పొంది అద్భుత విజయం సాధించింది. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై సంవత్సరం కావస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో ప్రభాస్ ఫేస్‌బుక్‌ వేదికగా తన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆ సినిమా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి, మిగతా నటీనటులు, సాంకేతిక వర్గానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

బాహుబలి తర్వాత హీరో ప్రభాస్‌కి బాగా మార్కెట్ పెరిగింది. తెలుగుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలో కూడా ఆఫర్లు వెల్లువల్లా వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘సాహో’ చిత్రంపై ఆయన అభిమానులు అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా రూపుదిద్దుకుంటోంది. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత "రన్ రాజా రన్" చిత్రానికి దర్శకత్వం వహించిన సుజీత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం గమనార్హం. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Trending News