సుబ్బరాజుకి జపాన్‌లో జబర్దస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్..!

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు పొందిన సుబ్బరాజుకి జపాన్‌లో ఈ మధ్యకాలంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందట

Last Updated : Jun 29, 2018, 06:48 PM IST
సుబ్బరాజుకి జపాన్‌లో జబర్దస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్..!

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు పొందిన సుబ్బరాజుకి జపాన్‌లో ఈ మధ్యకాలంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందట. అందుకు కారణం ఆయన నటించిన "బాహుబలి 2" చిత్రం. ఈ చిత్రంలో ఆయన పోషించిన కుమార వర్మ పాత్రకు జపాన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలే సుబ్బరాజు కుమారవర్మ వేషం ధరించి జపాన్‌లో థియేటర్లను సందర్శించినప్పుడు ఆయనకు అనుకోని రీతిలో రెస్పాన్స్ వచ్చిందట.

ఇప్పటికే జపాన్‌లో బాహుబలికి అభిమానులు పెరుగుతున్న నేపథ్యంలో.. అందులోని పాత్రలు అన్నింటిని కూడా సూపర్ హీరోల్లా ఫీలవుతున్నారు జపాన్ సినీ అభిమానులు. ముఖ్యంగా బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవ, కుమార వర్మ పాత్రలకు వారు ఫిదా అయ్యారట. అందుకే సుబ్బరాజు పోషించిన కుమారవర్మ పాత్ర తమకు లైవ్‌గా థియేటర్లలో కనిపించినప్పుడు ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారట.

ఇటీవలే ఈ విషయాన్ని సుబ్బరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే కొన్ని ఫోటోలు కూడా పంచుకున్నారు. బాహుబలి టీమ్ కూడా సోషల్ మీడియాలో ఈ విషయమై పలు పోస్టులు చేసింది.  ‘‘జపాన్ వాసులు మా కుమారవర్మపై చూపించిన ఆదరాభిమానాలకు థ్యాంక్స్. మా సుబ్బరాజు ఆనందాన్ని చూసి మాకు ఆశ్చర్యం వేసింది’’ అంటూ ట్వీట్ కూడా చేసింది బాహుబలి టీమ్.

Trending News