అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ టైటిల్ పోస్టర్ వచ్చేసింది

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ టైటిల్ పోస్టర్ విడుదల 

Last Updated : Oct 26, 2018, 03:29 PM IST
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ టైటిల్ పోస్టర్ వచ్చేసింది

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా అవతరించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహీద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ఇవాళ విడులైంది. కబీర్ సింగ్ పేరిట తెరకెక్కనున్న ఈ సినిమా పోస్టర్‌ను స్వయంగా షాహీద్ కపూర్ ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. టైటిల్ పోస్టర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం వచ్చే ఏడాది జూన్ 21న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. అర్జున్ రెడ్డి మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తోన్న కబీర్ సింగ్ సినిమాలో షాహీద్ కపూర్ సరసన ఎంఎస్ ధోని, భరత్ అనే నేను చిత్రాల ఫేమ్ కియారా అద్వాని జంటగా నటిస్తోంది. అర్జున్ రెడ్డి మూవీలో హిరోగా నటించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నటుడిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.

తెలుగులో మొదటి సినిమాతోనే దర్శకుడిగా విమర్శకులచేత శభాష్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగకే మరోసారి ఇదే సినిమాను హిందీలో డైరెక్ట్ చేసే అవకాశం రావడం విశేషం.

Trending News