'మాటిస్తున్నా.. మా జీవితం మీకే అంకితం': 'అరవింద సమేత' ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ భావోద్వేగం

'మాటిస్తున్నా.. మా జీవితం మీకే అంకితం'

Last Updated : Oct 3, 2018, 10:09 AM IST
'మాటిస్తున్నా.. మా జీవితం మీకే అంకితం': 'అరవింద సమేత' ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ భావోద్వేగం

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో అర‌వింద స‌మేత ట్రైల‌ర్ ను హీరో కళ్యాణ్ రామ్ లాంచ్ చేశారు.  ‘ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా’ అంటూ ఎన్టీఆర్‌తో నాయనమ్మ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్.  'వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అని హీరోయిన్ చెప్పే డైలాగ్.. ‘'సార్.. వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్.. తవ్వి చూడండి’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

'మాటిస్తున్నా.. మా జీవితం మీకే అంకితం'

ఈ వేదికపై ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణని తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సినిమా నా జీవితంలో ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. ఇది నా 28వ సినిమా అని ఎన్టీఆర్ అన్నారు.  'నా జీవితంలో నెల క్రితం జరిగిన ఘటన, ఈ సినిమాతో ముడిపడి ఉంది. ఎప్పుడూ తండ్రి చితికి నిప్పటించే సన్నివేశాన్ని చేయలేదు. ఆ సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. యాధృచ్ఛికమో లేక అలా జరిగిందో ఏమో నాకు తెలీదు. మా నాన్నకు ఇచ్చిన మాటే అభిమానులందరికీ ఇస్తున్నా.. మా జీవితం మీకు అంకితం' అంటూ భావోద్వేగంతో మాట్లాడారు.  'మనిషిగా ఎలా బతకాలో చెప్పే చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ అన్నారు ఎన్టీఆర్‌.

త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కించిన ఈ చిత్రం.. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా. జ‌గ‌ప‌తిబాబు. నాగబాబు, సునీల్  ఇత‌ర పాత్రల‌లో క‌నిపించ‌నున్నారు. థ‌మ‌న్ స్వరాలు స‌మ‌కూర్చాడు. రాధాకృష్ణ నిర్మాత.

 

 

 

Trending News