యన్.టి.ఆర్ బయోపిక్‌లో బాహుబలి బ్యూటీ అనుష్క

ఎన్టీఆర్ బయోపిక్‌లో బాహుబలి బ్యూటీ అనుష్క

Last Updated : Nov 7, 2018, 02:02 PM IST
యన్.టి.ఆర్ బయోపిక్‌లో బాహుబలి బ్యూటీ అనుష్క

స్వర్గీయ శ్రీ నంద‌మూరి తార‌క‌రామారావు యదార్ధగాధ ఆధారంగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ బయోపిక్‌లో ఇప్పటికే ప్రముఖ నటీనటులు ఎందరో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నటీనటులే కాకుండా ప్రముఖ దర్శకులు, నిర్మాతలు సైతం ఈ సినిమాలో పాల్పంచుకుంటున్నారు. ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆయా ప్రముఖుల సరసన తాజాగా బాహుబలి బ్యూటీ అనుష్క పేరు కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. అవును, ఎన్టీఆర్ బయోపిక్‌లో అనుష్క ఓ సీనియర్ హీరోయిన్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. 

ఎన్టీఆర్ సరసన అప్పటి ప్రముఖ నటీమణుల్లో ఒకరైన బి. సరోజాదేవి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడి భాగంలో ఆయా సూపర్ హిట్ చిత్రాలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించే క్రమంలో బి స‌రోజా దేవి పాత్ర కోసం అనుష్క‌ని తీసుకున్నట్టు సినీవవర్గాలు చెబుతున్నాయి‌. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. 

ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు, ప్రత్యేకతలతో కూడిన ఎన్టీఆర్ జీవితాన్ని కేవలం రెండున్నర, మూడు గంటల నిడివిలో చూపించడం కష్టం అని భావించిన ఎన్టీఆర్ బయోపిక్ మేకర్స్.. ఈ సినిమాను రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు. అందులో మొదటి భాగం 'యన్.టి.ఆర్ - కథానాయకుడు' చిత్రం జనవరి 9న విడుదల కానుండగా, 'యన్.టి.ఆర్- మహానాయకుడు' జనవరి 24న విడుదల అవనుంది. 

Trending News