అనుష్క విషయంలో రాజమౌళి మదిలో ఏముందో మరి..అంతా ఆయనకే తెలుసు !!

RRR లో అనుష్క కోసం సరికొత్త రోల్ క్రియేట్ చేస్తున్నట్లు  టాక్ వినిపిస్తోంది

Last Updated : Mar 27, 2019, 08:06 PM IST
అనుష్క విషయంలో రాజమౌళి మదిలో ఏముందో మరి..అంతా ఆయనకే తెలుసు !!

చరిత్ర ఆధారంగా తెరపైకి ఎక్కుతున్న 'RRR' మూవీ  గురించి దర్శకుడు రాజమౌళి ఎన్నో విషయాలు బయటికి చెప్పేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ రోల్స్ దగ్గర నుంచి కథాంశం వరకు అన్ని విషయాలు బయటపెట్టేశాడు.. కానీ అనుష్క విషయం బయపెట్టలేదు.
అనుష్క లేకుంటే ఎలా ?
'RRR' లాంటి భారీ మూవీలో అనుష్క లేకపోతే ఎలా అనేది రాజ్ మౌళి మదిలో మొదలుతున్న ప్రశ్న ఇది. బాహుబలిలో అద్భుత నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న అనుష్క లేకుండా తీస్తే ఈ మూవీని జనాలు ఆదరిస్తారా ? అని రాజ్ మౌళి మదన పడుతున్నట్లు టాక్
 రీజన్స్ ఇవే...
'RRR'లో అనుష్కను తీసుకోవడానికి అనేక రీజన్స్ ఉన్నాయి.  జస్ట్ గ్లామరస్ రోల్సే కాదు… క్యారెక్టర్ లో దమ్ముండాలి కానీ డీ గ్లామర్ లుక్స్ లో కనిపించడానికైనా... కాస్త వయసు పైబడిన క్యారెక్టర్స్ లో కనిపించాల్సి వచ్చినా ఏ మాత్రం నో చెప్పదు అనుష్క. అందుకే 1920 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క కోసం,  డెఫ్ఫినెట్ గా ఓ క్యారెక్టర్ రాసుకునే ఉంటాడు రాజమౌళి అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. 
RRRలో అనుష్క...
గతంలో ఇలాగే ఆలియా భట్ పేరు వినిపించింది… కొన్నాళ్ళకు కన్ఫమ్ అయింది. అలాగే ఇప్పుడు అనుష్క కూడా కన్ఫమ్ అవుతుందా..? చెప్పలేం. ఇంకొన్నాళ్ళు ఆగితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు. ఏది ఏమైనా RRRలో అనుష్క అంటూ సోషల్ మీడియాలో అప్పుడే మరో రూమర్ స్టార్ట్ అయిపోయింది.

Trending News