హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు ఇండియాలో అత్యంత ప్రజాధరణ కలిగిన సెలబ్రిటీ కపుల్ గా గుర్తింపు ఉంది. ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. పెళ్లి చేసుకోవడానికి ముందు డేటింగ్ చేస్తున్నప్పటి నుండి వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటూ ఆదర్శంగా నిలిచారు. గత రెండు నెలలుగా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఒకరినొకరు తమ ప్రేమానురాగాలను, అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ సామజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షమవుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఉత్తమ జంటగా ఉన్న వీరిద్దరికీ ట్విట్టరాటీలు భారీ షాక్ ఇచ్చారు. అయితే ఈ సారి ఏకంగా వారి మధ్య బంధాలకే ఎసరు పెట్టేసారు. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు
Also Read: Telangana CMO: తెలంగాణ సీఎం ఆఫీసులోనే కరోనా కేసు
ప్రస్తుతం ట్విట్టర్ లో #VirushkaDivorce (విరుష్క విడాకులు) అనే అంశం టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ఓ పాత వార్త వైరల్ అవుతోంది. నిజానికి ఈ వార్త 2016 ఫిబ్రవరి నాటిది కాగా అప్పుడే వీరిద్దరూ సన్నిహితంగా ప్రారంభించారు. అప్పటి వార్త ఇప్పుడు మళ్లీ ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై విరుష్క అభిమానులు సైతం సరదాగా వ్యాఖ్యలు చేస్తూ ఉత్సాహంలో మునిగితేలుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
( Read also : Health tips: సమ్మర్లో ఎండ వేడి నుంచి ఈ పానియాలతో త్వరిత ఉపశమనం )