రంగస్థలంలో "రంగమ్మత్త"గా అనసూయ..!

రామ్ చరణ్ తేజ, సమంత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం". 

Last Updated : Mar 18, 2018, 10:00 PM IST
రంగస్థలంలో "రంగమ్మత్త"గా అనసూయ..!

రామ్ చరణ్ తేజ, సమంత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం". ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ అనసూయ, సమంతకు తల్లి పాత్రలో నటిస్తుందని ఇటీవలే ఓ పుకారు టాలీవుడ్ సోషల్ మీడియా పేజీల్లో హల్చల్ చేసింది. అయితే ఎట్టకేలకు ఇదే అంశంపై అనసూయ క్లారిటీ ఇచ్చారు. విశాఖపట్నంలో జరిగిన ‘రంగస్థలం’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆమె మాట్లాడారు.

తాను సమంతకు తల్లిపాత్రలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. తన పాత్ర పేరు " రంగమ్మత్త" అని తెలిపారు. రామ్ చరణ్ తనను ఈ చిత్రంలో "అత్తా" అని పిలవడం తనకు సరదాగా అనిపించిందని ఆమె అన్నారు. తన సంభాషణలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని కూడా ఆమె తెలిపారు. ‘రంగస్థలం’ చిత్రం నిజంగా ప్రేక్షకులకు ఓ కొత్త లోకాన్ని పరిచయం చేస్తుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. 

Trending News