COVID19 లక్షణాలు తక్కువున్నా అమితాబ్ ఆస్పత్రిలో ఎందుకు చేరారంటే!

బాలీవుడ్ అగ్రనటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కుటుంబం కరోనా వలయంలో చిక్కుకుంది. ఆయనతో పాటు కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొన్ని కారణాలతో అమిబాబ్ ఆస్పత్రిలో చేరేందుకు మొగ్గుచూపారు.

Last Updated : Jul 12, 2020, 12:18 PM IST
COVID19 లక్షణాలు తక్కువున్నా అమితాబ్ ఆస్పత్రిలో ఎందుకు చేరారంటే!

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ (Amitabh Bachchan Tests COVID19 Positive)‌గా రావడం తెలిసిందే. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ముంబైలోని నానావతి ఆసుపత్రి (Nanavati hospital)లో చేర్పించి కరోనా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే కోవిడ్19 లక్షణాలు చాలా తక్కువగా ఉనప్పటికీ ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలోనే చేరి బిగ్ బి అమితాబ్ చికిత్స పొందుతున్నారు. ఆయన తనయుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు సైతం కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.  తొలిసారిగా మాస్క్ ధరించిన డొనాల్డ్ ట్రంప్

అమితాబ్ (Amitabh Bachchan)‌కు వయసురీత్యా సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయి. టీబీ, ‘హెపటైటిస్ బి’తో పోరాడుతున్నారు. ఆయన కాలేయం పనితీరు అంతంత మాత్రంగానే ఉందని తెలిసిందే. అమితాబ్ వయసు 77 ఏళ్లు. కరోనా లక్షణాలు తొలి దశలోనే ఉన్నా, ఈ వయసులో రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

శనివారం రాత్రి తనకు కోవిడ్19 పాజిటివ్ అని అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత తనకు కూడా పాజిటివ్‌గా తేలిందని అభిషేక్ బచ్చన్ తెలిపారు. జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు టెస్టులు నిర్వహించారని, రిపోర్టు రావాల్సి ఉందన్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News