విక్కీ  కౌశల్‌ పై మనసు పారేసుకున్న మిల్కీ బ్యూటీ ?

                      

Last Updated : Mar 27, 2019, 09:00 PM IST
విక్కీ  కౌశల్‌ పై మనసు పారేసుకున్న  మిల్కీ బ్యూటీ  ?

విక్కీ  కౌశల్‌ పై మిల్కీ బ్యూటీ తమన్న మనసు పారేసుకున్నట్ల సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకొచ్చినట్లు ? ఈ విషయంలో తెలుసుకోవాలంటే వివరాల్లో వెళ్లాల్సిందే..

ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ తమన్నకు ఓ గట్టి ప్రశ్న ఎదురైంది. మీరు డేటింగ్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారని మిల్కీ బ్యూటీ తమన్నాను అడిగితే...ఏమాత్రం తడబడకుండా  విక్కీ కౌశల్‌తో వెళ్తానంటూ తమన్న  కుండబద్దలు కొట్టేసింది.  విక్కీ నటించిన ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ సినిమా చూశానని తన నటనతో విక్కీ ఆకట్టుకున్నాడని తమన్న తెలిపింది.

మిల్కీ బ్యూటీ తమన్న చేసిన తాజా వ్యాఖ్యలతో విక్కీ  కౌశల్‌ పై తమన్న మనసు పారేసుకుందనే రూమర్స్ మొదలయ్యాయి. తాజా రూమర్స్ పై తమన్న ఏ విధంగా స్పందిస్తునేది దానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

Trending News