Apsara Rani: అప్సరా రాణి క్రేజ్ చూశారా.. 4 రోజుల్లో 50కి పైగా ఫేక్ అకౌంట్లు

రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన సెక్సీ హీరోయిన్ అప్సరా రాణి (Apsara Rani)కి క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రేజ్ చూసి సంతోషించాలో.. బాధపడాలో తెలియడం లేదంటోంది హాట్ బ్యూటీ అప్సరా రాణి. వాస్తవానికి అంకితా మహారాణాను అప్సరా రాణిగా పేరు మార్చి థ్రిల్లర్ మూవీలో అవకాశమిచ్చాడు దర్శకుడు వర్మ.

Last Updated : Jul 14, 2020, 10:46 AM IST
Apsara Rani: అప్సరా రాణి క్రేజ్ చూశారా.. 4 రోజుల్లో 50కి పైగా ఫేక్ అకౌంట్లు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రస్తుతం మర్డర్, పవర్ స్టార్ చిత్రాలతో పాటు, 12'0 క్లాక్, థ్రిల్లర్ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. థ్రిల్లర్ సినిమా కోసం తీసుకున్న హాట్ హీరోయిన్ అప్సరా రాణి (Apsara Rani)కి సోషల్ మీడియాలో రోజురోజుకూ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. తొలుత డైరెక్టర్ అప్సరా రాణిని పరిచయం చేస్తూనే ఆమె ఫొటోషూట్ ఫొటోల (Apsara Rani Hot Photos)ను సైతం నెటిజన్లకు అందించాడు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

ఇక అది మొదలుకుని నటి అప్సరా రాణి ఫొటోలు సోషల్ మీడియాను ఏలుతున్నాయి. ఆమెను ట్విట్టర్‌లో పరిచయం చేసిన రోజే ఏకంగా దాదాపు 11వేలకు పైగా ఫాలోయర్లను అప్సరా రాణి సొంతం చేసుకుంది. ప్రస్తుతం 38వేలకు పైగా ఫాలోయర్లున్నారు. గత నాలుగు రోజుల్లోనే నటి అప్సరా రాణి పేరుతో 50కి పైగా ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు (Apsara Rani Fake Accounts) పుట్టుకొచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అప్సరా రాణి ట్వీట్ చేసింది. అప్సరా రాణిగా పేరు మార్చి RGV థ్రిల్లర్ ఛాన్స్!

‘ఇలా జరిగిందని సంతోషపడాలా.. లేక ఫీల్ అవ్వాలో తెలియడం లేదు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నా పేరుతో 50కి పైగా ఫేక్ ట్విట్టర్ ఖాతాలు పుట్టుకొచ్చాయి. నా కళ్లు తిరిగిపోయాయి. నా ఒరిజినల్ ట్విట్టర్ ఖాతా ఇది అంటూ’ ఓ ఫొటోను షేర్ చేసింది సోషల్ మీడియా సెన్సేషన్ అప్సరా రాణి. వర్మ హీరోయిన్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందిలే. అందులోనూ అందంగా ఉంటుంది, ఆకర్షణీయమైన రూపం, ముఖ్యంగా ఆ కళ్లు నెటిజన్లను ఆమె ఫొటోలను చూసేలా కట్టిపడేస్తున్నాయి. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

అప్సరా రాణి ట్వీట్ (Apsara Rani Tweets)‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఏంటిది.. 50 ఫేక్ అకౌంట్లా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. అయితే.. ఇది తనపై చూపిస్తున్న ప్రేమగా భావిస్తున్నానని అప్సరా మరో ట్వీట్ చేసింది. ప్రేమ కాకపోతే ఇంకేంటి మిస్ ఏంజెల్ అని వర్మ వత్తాసు పలికాడు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News