ఫ్లైట్లో 'దంగల్' నటి జైరా వసీంకు వేధింపులు

ఇటీవల ఢిల్లీ-ముంబయి విమానంలో ఓ కో-ప్యాసింజర్ తనను వేధించాడని బాలీవుడ్ నటి జైరా వసీం వెల్లడించింది.

Last Updated : Dec 10, 2017, 10:04 AM IST
ఫ్లైట్లో 'దంగల్' నటి జైరా వసీంకు వేధింపులు

న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ-ముంబయి విమానంలో ఓ కో-ప్యాసింజర్ తనను వేధించాడని బాలీవుడ్ నటి జైరా వసీం వెల్లడించింది. శనివారం జరిగిన సంఘటనపై ఆమె విచారం వ్యక్తపరుస్తూ, విస్టా ఫ్లైట్లో వెనుక కూర్చున్న ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు అంది.

ఆమె చెప్పిన కథనం మేరకు.. జైరా నిద్రపోతున్నప్పుడు ఆ మనిషి మెడను నిమురుతున్నాడు. ఆమె అతడు ఏమి చేస్తున్నాడో రికార్డు చేయడానికి ప్రయత్నించింది. కానీ డిం లైట్ల కారణంగా రికార్డు చేయలేకపోయింది. అయితే, ఆమె కొంతమేరకు విమానంలో అతడి ప్రవర్తనకు సంబంధించి స్క్రీన్ షాట్స్ పొందింది. 

అంతేకాదు జైరా విమాన సిబ్బందిపై కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. విమానం ల్యాండ్ అయిన తరువాత, ఆమె సోషల్ మీడియా 'ఇంస్టాగ్రామ్' ద్వారా లైవ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, ఆమె కన్నీరు పెట్టుకుంది. "ఇది చేయకూడదు.. కానీ  నేను బాధపడ్డాను. మీరు ఇలాగేనా అమ్మాయిల జాగ్రత్త తీసుకొనేది?" అని జైరా ప్రశ్నించారు. 'మాలాంటి అమ్మాయిలకు ఎవరు సహాయపడేది? మనకి మనం సహాయం చేసుకోలేకపోతే, ఎవరూ రారు' అని అంది. 

 

Somebody misbehaved with her in the flight 😤 Strict actions must be taken on this incident 😡 OMG she is Crying 😢 . . . . . . . . #repost #flightattendant #misbehaving #terrible #actions #kashmir #india #indian #fools #live #zaira #zairawasim #bolllywood #video #viral #follow4follow #like4like #airport #fans

A post shared by zaira wasim (@zaira_wasimworld) on

 

ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సదరు ఎయిర్ లైన్స్ స్పందించింది."గత రాత్రి కో-ప్యాసింజర్ ప్రవర్తనపై జైరా వసీం మాట్లాడిన వీడియో చూశాము. అలాంటి ప్రవర్తనను మేము సహించము. దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తున్నాము. మేము అన్నివిధాలా జైరా వసీంకు మద్దతిస్తాము' అని ఎయిర్ లైన్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

జైరా వసీం 'దంగల్' చిత్రంతో తన నటనను ప్రారంభించింది. ఇది అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటి. ఇటీవల ఈమె సీక్రెట్ సూపర్ స్టార్ లో కనిపించింది.

Trending News