Lineman Movie: గ్రామంలో పది రోజులు కరెంట్ పోతే.. ఎవరు టచ్ చేయని పాయింట్‌తో 'లైన్ మ్యాన్‌': హీరో త్రిగుణ్

Actor Thrigun Lineman: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన లైన్ మ్యాన్ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. ఓ గ్రామంలో పది రోజులు కరెంట్ పోతే ఎలా..? లైన్ మ్యాన్ అన్ని రోజులు కరెంట్ ఎలా తీశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హీరో త్రిగుణ్‌ మీడియాతో ముచ్చటించారు.      

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2024, 08:59 PM IST
Lineman Movie: గ్రామంలో పది రోజులు కరెంట్ పోతే.. ఎవరు టచ్ చేయని పాయింట్‌తో 'లైన్ మ్యాన్‌': హీరో త్రిగుణ్

Actor Thrigun Lineman: త్రిగుణ్ హీరోగా వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లైన్‌ మ్యాన్. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా మార్చి 22న ఆడియన్స్ ముందుకురానుంది. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవ్వగా.. ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను హీరో త్రిగుణ్‌ మీడియాతో ముచ్చటించారు. ‘లైన్ మ్యాన్’ మూవీ కథతో రెండు స్టోరీలను కూడా నిర్మాతలను తనకు పంపించారని.. మూడింటిలో లైన్ మ్యాన్‌ కథ బాగా నచ్చిందన్నారు. కామెడీ పండిస్తునే.. మంచి మెసేజ్ కూడా ఉంటుందన్నారు. కథ ప్రకృతికి సంబంధించిన తనకు బాగా కనెక్ట్ అయిందన్నారు. అందుకే ఈ కథను ఎంచుకున్నానని చెప్పారు. 

Also Read: Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు, అరెస్ట్

నటుడిగా 23 సినిమాలు చేశానని.. లైన్ మ్యాన్ మూవీ సినిమా ప్రత్యేకమైన చిత్రంగా తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు త్రిగుణ్. ఈ మూవీ చేయడం తనకు గర్వంగా కూడా అనిపించిందన్నారు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని స్టోరీతో వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి కలిగించే విషయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ గంటపాటు కరెంట్ పోతేనే ఎలా ఇబ్బందిపడతామో తెలుసని.. అలాంటిది ఓ విలేజ్‌లో 10 రోజులపాటు కరెంట్ లేకుండా పోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది లైన్‌ మ్యాన్ సినిమా అని చెప్పారు.

పది రోజులు గ్రామంలో లైన్ మ్యాన్ కరెంట్ ఎలా తీసేశాడనేది ఆసక్తికరంగా ఉంటుందని.. చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్ కూడా ఉంటుందని ఈ యంగ్ హీరో తెలిపారు. డైరెక్టర్ రఘుశాస్త్రి సినిమాను చక్కగా తెరకెక్కించారని చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు మనం పల్లెటూర్‌లో ఉన్నట్లే ఉంటుందని.. నేచురాల్‌గా మాట్లాడినట్లే అనిపిస్తుందన్నారు. ఈ సినిమాను ముందు కన్నడలో చేయాలని నిర్మాతలు అనుకున్నారని.. తనకు తెలుగులో కాస్త మంచి గుర్తింపు ఉండడంతో టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారని తెలిపారు. కామెడీతోపాటు చిన్న లవ్ పాయింట్‌తో మనసుకు హత్తుకునేలా హార్ట్ టచింగ్ మెసేజ్ ఉంటుందన్నారు. 

తాను నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు అవుతుందని.. కానీ ఇప్పటికీ కొత్తగా వచ్చినట్లే ఉంటుందన్నారు. కొత్త సినిమా చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నానని.. కమర్షియల్ సినిమాలు చేయాలని, మార్కెట్ పెంచుకోవాలని తాను అనుకోలేదన్నారు. తనతో మూవీ చేసిన నిర్మాతకు లాభాలే తప్పా.. నష్టాలు ఉండకూడదని నమ్ముతానని అన్నారు. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించానని.. మరో వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నానని తెలిపారు. మరికొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయని.. అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. 

Also Read: Kidnap Drama: 'ఇది బిగనర్స్‌ మిస్టేక్స్‌ చూసుకోవాలి కదా!'.. బెడిసికొట్టిన యువతి కిడ్నాప్‌ డ్రామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News