Market Mahalakshmi: 27 ఏళ్ల కెరీర్ మొదలు పెట్టా.. 50 ఏళ్లకు గుర్తింపు వచ్చింది: శివాజీ

Market Mahalakshmi Title Poster: మార్కెట్ మహాలక్ష్మి మూవీ పోస్టర్‌ను నటుడు శివాజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. నిజాయతీగా పనిచేయాలని.. సక్సెస్ దానంతట అదే వస్తుందని చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 02:01 PM IST
Market Mahalakshmi: 27 ఏళ్ల కెరీర్ మొదలు పెట్టా.. 50 ఏళ్లకు గుర్తింపు వచ్చింది: శివాజీ

Market Mahalakshmi Title Poster: కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా.. వియస్ ముఖేష్‌ యువ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'మార్కెట్ మహాలక్ష్మి'. ఈ సినిమా ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం కానుంది. బి2పి స్టూడియోస్‌పై అఖిలేష్ కలారు నిర్మిస్తున్నారు. హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను బిగ్‌ బాస్ ఫేమ్, నటుడు శివాజీ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అతిథిగా వచ్చి చిత్రబృందానికి ఆల్‌ ద బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. తాను 27 ఏళ్ల వయసులో నటన మొదలు పెడితే.. 50 ఏళ్లకు గుర్తింపు వచ్చిందన్నారు. ఏదో రోజు గుర్తింపు తప్పకుండా వస్తుందని.. క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ముఖ్యమన్నారు. కేరింత సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన హీరో పార్వతీశానికి ఈ సినిమా ద్వారా తప్పకుండా గుర్తింపు వస్తుందని నమ్మకం తనకు ఉందన్నారు. నిర్మాత అఖిలేష్ కలారుకి మంచి లాభాలు రావాలని అన్నారు. దర్శకుడు వియస్ ముఖేష్ కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. హీరోయిన్ ప్రణీకాన్వికా నేమ్ టంగ్ ట్విస్టర్‌లా ఉందని.. ఆర్ట్ ఫార్మ్‌ను  నమ్ముకున్న ప్రతి ఒక్కరు తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. అందరు నిజాయతీగా పనిచేయాలని.. సక్సెస్ దానంతట అదే వస్తుందన్నారు. 

అనంతరం నిర్మాత బెక్కమ్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మార్కెట్ మహాలక్ష్మి సినిమా తాను ముందుగానే చూశానని.. సినిమా చూసినప్పుడు తనకు శేఖర్ కమ్ముల సినిమాలు గుర్తొచ్చాయని చెప్పారు. ఒక చక్కటి ఫ్యామిలీ లవ్ డ్రామాగా తెరకెక్కించిన విధానం చాలా బాగుందన్నారు. ఎక్కడా ల్యాగ్ లేకుండా.. ఫ్యామిలీ అండ్ లవ్ ఎమోషన్స్‌ను పండించారని అన్నారు. అందరూ చక్కగా యాక్ట్ చేశారని.. చిత్రబృందానికి ఆల్‌ ద బెస్ట్ చెప్పారు.

దర్శకుడు వియస్ ముఖేష్ మాట్లాడుతూ.. ఇది తన ఫస్ట్ మూవీ అని.. టైటిల్ పోస్టర్ ఆవిష్కరించిన శివాజీకి.. సహకారం అందించిన బెక్కం వేణు గోపాల్‌కు ధన్యవాదాలు చెప్పారు. తనకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత అఖిలేష్‌కు, ఈ మూవీ నటించేందుకు ముందుకి వచ్చిన హీరోహీరోయిన్స్‌, నటీనటులకు ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిష్టర్ జో సంగీతం అందివ్వగా.. సినిమాటోగ్రఫర్‌గా సురేంద్ర చిలుముల పనిచేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఆర్.యమ్.విశ్వనాధ్ కూచనపల్లి నిర్వర్తిస్తున్నారు. వియస్ ముఖేష్, మిష్టర్ జో పాటలు రాశారు. 

Also Read: TS Politics: ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సెలైంట్.. జెండా పీకేసినట్లేనా..!

Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News