SIT Movie in ZEE5: SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) మూవీతో మంచి విజయాన్ని అందకున్నాడు యంగ్ హీరో అరవింద్ కృష్ణ. ప్రస్తుతం ZEE5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టాప్ లిస్టులో ట్రెండ్ అవుతోంది. అరవింద్ కృష్ణ మల్టీ షేడ్ పాత్రలో అందరినీ అలరించారు. విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండడం విశేషం. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నాగిరెడ్డి, తేజపల్లి, శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
Also Read: Couple Romance Video: రైల్లోనే ప్రేమ జంట గబ్బు పని.. నెట్టింట వీడియో లీక్..!
ఆర్మాక్స్ రేటింగ్ ప్రకారం.. దేశవ్యాప్తంగా అత్యధికంగా లైక్ చేసిన.. అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమాలు/వెబ్ సిరీస్ జాబితాలో SIT అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో భారీ పోటీ ఉన్నా.. గ్రిప్పింగ్‌గా సాగే ఈ SIT 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది. దీంతో దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్ పాత్రలో అరవింద్ కృష్ణ జీవించేశాడు. ఎంతో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అయినా.. చక్కగా నటించి అందరి మెప్పుపొందారు. గ్రే షేడ్స్‌తో అరవింద్ కృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అరవింద్ కృష్ణ యాక్షన్ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం అరవింద్ కృష్ణ కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారు. ఆయన నటించిన ఓ సూపర్ హీరో మూవీ “ఎ మాస్టర్‌పీస్” త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరికొన్ని అడ్వెంచర్స్ సినిమాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇక సినిమాలతోపాటు అరవింద్ కృష్ణ మంచి స్పోర్ట్స్‌తో కూడా బిజీగా ఉంటారు. ఆయన బాస్కెట్ బాల్ ప్లేయర్ అని తెలిసిందే.
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ఉలిక్కిపడిన ప్రపంచం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి