ట్రోలర్స్ ఆగడాలకు "ట్విట్టర్" చెక్..!

ట్విటర్ యాజమాన్యం ఈ మధ్యకాలంలో ఓ నూతన నిర్ణయం తీసుకుంది. తమ సోషల్ మీడియా సైట్‌లో హింసను ప్రేరేపించే పోస్టులు.. అసభ్యత, అశ్లీలతతో కూడిన భాషను వాడే పోస్టులు పెట్టే యూజర్ల ఆగడాలకు అడ్డు్కట్ట వేయాలని భావించింది. 

Last Updated : Jul 31, 2018, 09:22 PM IST
ట్రోలర్స్ ఆగడాలకు "ట్విట్టర్" చెక్..!

ట్విటర్ యాజమాన్యం ఈ మధ్యకాలంలో ఓ నూతన నిర్ణయం తీసుకుంది. తమ సోషల్ మీడియా సైట్‌లో హింసను ప్రేరేపించే పోస్టులు.. అసభ్యత, అశ్లీలతతో కూడిన భాషను వాడే పోస్టులు పెట్టే యూజర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భావించింది. ఈ క్రమంలో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ పలువురు నిపుణుల సహాయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ నిపుణుల టీమ్‌లో యూజర్ల మానసిక స్థితిని అంచనావేసి ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టేందుకు గాను.. పలువురు ప్రముఖ మానసిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, నిపుణులు సేవలు అందించనున్నారట.

ఆమ్‌స్టర్‌డమ్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పలువురు పరిశోధక విద్యార్థులు కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నారు. ముఖ్యంగా ట్రోలింగ్  పేరుతో ఎవరి మీద పడితే వారి మీద అనుచితమైన కామెంట్లు చేసే ట్రోలర్స్‌ను నియంత్రించడానికి కూడా ట్విట్టర్ సరికొత్త ప్రణాళికలను రూపొందించనుంది. ట్విట్టర్‌ను ఒక మంచి డిస్కషన్ వేదికగా మార్చాలన్నదే తమ అభిమతమని ఆ సంస్థ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. 

ఈ మధ్య కాలంలో ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వేదికలను ఆధారంగా చేసుకొని కూడా పలు రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడు వాడి వేడిగా సాగే ఆ చర్చలు శ్రుతిమించి పరస్పర దూషణలు చేసుకొనే వరకూ వెళ్తున్నాయి. అయితే అలాంటి సందర్భంలో పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించే టూల్స్ ఈ సోషల్ మీడియా సైట్స్‌కి లేకపోవడం అనేది ప్రధాన సమస్య అంటున్నారు పలువురు నిపుణులు. 

Trending News