Zee Telugu TV Serials: తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా జీ తెలుగు ఎన్నో కార్యక్రమాలను అందిస్తోంది. సాధారణ ప్రేక్షకులతోపాటు టీవీ సీరియల్స్ ప్రేక్షకులకు కొత్త కొత్త కథాంశాలతో వినోద కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా ప్రేక్షకులకు మరో శుభవార్తతో జీ తెలుగు మీ ముందుకు వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్ ఇకపై వారాంతాల్లోనూ ప్రసారం కానున్నాయి.
Also Read: Allu Arjun : మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కౌంటర్.. ఫైనల్ గా కాంట్రవర్సీపై క్లారిటీ..!
ఇన్నాళ్లు శని, ఆదివారాల్లో సీరియల్స్‌కు విరామం ఉంటుండగా ఇకపై ఆ రోజుల్లో కూడా జీ తెలుగు సీరియల్స్ ప్రసారం చేయనుంది. ప్రతి రోజూ సీరియల్స్ పండగే. ఆదివారం కూడా సీరియల్స్ అందించేందుకు జీ తెలుగు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఆదివారం కూడా ప్రసారమవుతాయని జీ తెలుగు ప్రకటించింది.
ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరేళ్ల సావాసం, మేఘ సందేశం, పడమటి సంధ్యారాగం, త్రినయని సీరియల్స్ ఇకపై ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయని జీ తెలుగు తెలిపింది. ఈ నాన్ స్టాప్ సీరియల్ ఎంటర్టైన్మెంట్ ఈ వారం నుంచే ప్రారంభం కానుండడం విశేషం. అశేష ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ ప్రేక్షకులను అలరించనున్నాయని జీ తెలుగు వెల్లడించింది. ఇక మధ్యాహ్నం సీరియల్స్ యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమవుతాయని స్పష్టం చేసింది.
ఆదివారం 'పిండం' స్ట్రీమింగ్
ఇక సినిమాల విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పిండం స్ట్రీమింగ్ కూడా జీ తెలుగు ప్రకటించింది. ఈ ఆదివారం (ఆగస్టు 25) మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను అవుతుందని ప్రకటించింది. థియేటర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా కథ, కథనం ఉత్కంఠ రేపుతోంది. అద్భుతమైన తారాగణంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పిండం సినిమా వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచి వారం వారం నాన్‌స్టాప్ సీరియల్స్‌తో పాటు సరికొత్త సినిమాలను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి అని జీ తెలుగు సూచించింది.
సీరియల్స్ సమయం
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి 6 గంటలకు
మా అన్నయ్య 6:30 గంటలకు
నిండు నూరేళ్ల సావాసం 7 గంటలకు
మేఘ సందేశం 7:30 గంటలకు
పడమటి సంధ్యారాగం 8 గంటలకు
త్రినయని 8:30 గంటలకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి