Sankranthi Special Show: సంక్రాంతికి జీ తెలుగు డబుల్ ధమాకా.. రెండు స్పెషల్ షోస్‌తో అలరించేందుకు రెడీ

Sankranthi Special Show In Zee Telugu: సంక్రాంతికి రెండు స్పెషల్ షోస్‌తో ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అయింది జీ తెలుగు. పండగంటే ఇట్టా వుండాల, బావ మరదళ్ల సరదా సంక్రాంతి అంటూ రెండు రోజులపాటు వినోదం పంచనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 08:51 AM IST
Sankranthi Special Show: సంక్రాంతికి జీ తెలుగు డబుల్ ధమాకా.. రెండు స్పెషల్ షోస్‌తో అలరించేందుకు రెడీ

Sankranthi Special Show In Zee Telugu: సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేసేందుకు స్పెషల్ షోతో ప్రేక్షలకులను అలరించేందుకు రెడీ అయింది జీ తెలుగు. పండగ వేళ ఇంటిల్లిపాది హాయిగా నవ్వుకుంటూ వినోదభరితంగా ప్రత్యేక కార్యక్రమాలతో షోను రూపొందించారు నిర్వాహకులు. భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు సరదా, వినోదం మేళవించి ప్రత్యేకంగా 'పండగంటే ఇట్టా వుండాల & బావ మరదళ్ల సరదా సంక్రాంతి' షోను డిజైన్ చేశారు. జనవరి 14, 15వ తేదీలలో వరుసగా రెండు రోజులపాటు సాయంత్రం 6 గంటలు, ఉదయం 10 గంటలకు జీ తెలుగు ప్రసారం కానుంది.

వెండితెర, బుల్లితెరపై ప్రేక్షకులను అలరించే స్టార్స్ ఒకే వేదికపై చేనున్నారు. పండగంటే ఇట్టా వుండాల అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్టార్ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత సందడి చేశారు. ఆద్యంతం వినోదం, నవ్వులు, ఉత్సాహంతో కోలాహలంగా సాగే విధంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. అంత్యాక్షరి పోటీతో షోను మొదలుపెట్టగా.. పడమటి సంధ్యా రాగం సీరియల్​ నటీనటులు, గాయనీగాయకుల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుంది. ఆ తర్వాత రాజశేఖర్, జీవితలకు అంకితమిస్తూ డ్రామా జూనియర్ కిడ్స్ చేసిన స్కిట్ అందరినీ భావోద్వేగానికి గురిచేయనుంది.

ఇక ఫన్ టాస్టిక్ అవార్డుల ప్రకటనతో వినోదం రెట్టింపు అవుతుంది. చమత్కారంగా.. వినోదాత్మకంగా సాగే ఫంట్ టాస్టిక్ అవార్డ్స్‌లో టీవీ సెలబ్రిటీలు అవార్డులను తీసుకోడానికి పోటీ పడడం నవ్వులు పూయించనుంది. ఫన్ టాస్టిక్ అవార్డుల ప్రదానం తర్వాత ఆడియన్స్‌కు మరో సర్ ​ప్రైజ్ ప్లాన్​ చేసింది జీ తెలుగు. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తువచ్చేది రకరకాల పిండి వంటలు. ఆ సంక్రాంతి సంస్కృతిని ఇనుమడించేలా.. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు సంఖ్యలో 500 రకాల ఆహార పదార్థాలతో తయారుచేసిన అతిపెద్ద థాలీని షోలో తయారు చేశారు. అనేక ప్రాంతాలకు చెందిన స్వీట్లు, పిండి వంటలు, పచ్చళ్లు, పొడులు, కూరలు.. ఇలా 500 రకాల వైవిధ్యమైన ఆహారపదార్థాలను పాకశాస్త్ర నిపుణులతో చేయించారు. అందరికీ నోరూరించేలా అతిపెద్ద థాలీని వడ్డించి సంక్రాంతి పండుగ విశిష్టతను ప్రత్యేకంగా చూపించనున్నారు. 

రెండో రోజు సంక్రాంత్రి సందర్భంగా బావా-మరదళ్ల సరదా సంబరంగా ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో శ్యామల, సౌమ్య యాంకర్లు వ్యవహరించనున్నారు. జీ తెలుగు పాపులర్ యాక్టర్స్‌తో పాటు ప్రముఖ నటీనటులు రాశి, ఆమని, సుమన్​ పాల్గొని  వినోదాన్ని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమంలో ‘సలార్​’ సినిమాలో నటించిన బాల నటులు వేసిన స్కిట్లు.. చేసిన అల్లరి ఆద్యంతం వినోదాన్ని పంచడం ఖాయం. సంక్రాంతి వేడుకలో హనుమాన్​ మూవీ కూడా సందడి చేయనుంది. సంక్రాంతి వేళ జీ తెలుగు అందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాలను ఇంటిల్లిపాది చూసి ఆనందించండి. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News