Kalki: అసలు ‘కల్కి’ ఎవరు.. ? ఆ అవతార మహత్యం ఏమిటి ? కల్కి లో ఈ అవతారాన్ని ఎలా చూపించబోతున్నారంటే..!

Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ? ఆ అవతార మహత్యంతో పాటు కల్కి మూవీలో ఈ అవతారాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 22, 2024, 02:57 PM IST
Kalki: అసలు ‘కల్కి’ ఎవరు.. ? ఆ అవతార మహత్యం ఏమిటి ? కల్కి లో ఈ అవతారాన్ని ఎలా చూపించబోతున్నారంటే..!

Kalki 2898 AD: కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో వచ్చి ధర్మ సంస్థాపన చేస్తారని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నారు. దానికి ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో ‘కల్కి’ సినిమా చేసినట్టు పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.
పరిత్రాణాయ సాధూనం వినాశాయ దుష్కృతామ్ ..!
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే..!!

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెబుతాడు. ఎపుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అపుడు నేను వివిధ రూపాల్లో అవతారిస్తానని స్వయంగా భగవంతుడే తన శిష్యుడైన అర్జునుడుకు చెప్పిన విషయం మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రీ మహా విష్ణువు తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చారు. భాగవతంలో శ్రీ మహా విష్ణువు దాదాపు 21 పైగా అవతారాలు ఎత్తాడు. అందులో లీలావతారాలు కొన్ని. అందులో దశావతారాలు ప్రముఖంగా అందరు ప్రస్తావిస్తూ ఉంటారు. శ్రీ కృష్ణ నిర్యాణం తర్వాత మహా విష్ణువు కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నట్టు హిందూ ధర్మ గ్రంథాలు ఘోషిస్తున్నాయ. ఆ పాయింట్ ను బేస్ చేసుకొని దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ మూవీని కాస్త ఫిక్షన్ జోడించి తెరకెక్కించాడు.

వేద వ్యాసుడు భాగవతం సహా 18 అష్టాదశ పురాణాలను, వేదాలను రచించారు. ఇక కల్కి అవతారం గురించి భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణంలో ప్రస్తావించబడింది. వేదాల ప్రకారం యుగాలు నాలుగు. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు. అందులో కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది. రెండో యుగమైన త్రేతా యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మూడోదైన ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడిచింది. ఇక త్రేతా యుగంలో శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా.. శ్రీరాముడి అవతారాలు ఎత్తాడు. అందులో పరశురాముడు అంశ అవతారం అయితే.. శ్రీరాముడు పరిపూర్ణావతారం. ఈ అవతారంలో రావణా సంహారం చేసిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసాడు.  ద్వాపరంలో కూడా శ్రీకృష్ణ అవతారంలో ధర్మ సంస్థాపన చేసారు. ప్రస్తుతం మన కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాము. ఈ యుగంలో ధర్మం ఒంటి పాదంపై కుంటుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక మనం రోజు చేసుకునే నిత్యపూజాదికాల్లో కూడా శ్వేత వరహా కల్పే.. కలియుగే ప్రథమపాదే..అని చెప్పుకుంటూ ఉంటాయి.

దశావతారాల్లో చివరిది ‘కల్కి అవతారం’. యేళ్లు గడిచే కొద్ది ఈ యుగంలో ఎలాంటి యజ్ఞ యాగాదాలు సహా ఏవి ఉండవు. గోవధ పెరిగిపోతుంది. మొత్తంగా వివాహా, విద్య వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయి. ప్రజలను కాపాడాల్సిన ప్రభువులు ప్రజలను పట్టించుకోరు. ప్రజలందురూ అకాల మృత్యువుతో బాధపడుతుంటారు. బ్రాహ్మాణులు వేదాధ్యయనం ఒదిలేస్తారు. సమాజాంలో కరువు తాండవించడం నిత్యకృత్యమైపోతుంది. దానం చేసే వారు లేక దోపిడీలో పెరిగిపోతాయి.  ఇలా అన్ని రకాలుగా సమాజం భ్రష్టు పట్టిన తరుణంలో కలియుగం చివరి పాదంలో శ్రీ మహావిష్ణువు శంబల గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మాణ కుటుంబంలో ‘కల్కి’
జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆయన అవతారంలో పాపులందరికి విచిత్రమైన వ్యాధితో బాధపడూతూ రాలిపోతారు. ఎక్కడ చూసిన వ్యాధులు ఉంటాయి.అంతేకాదు ఈ అవతారంలో కల్కి తెల్ల గుర్రం ఎక్కి.. కాషాయ జెండా ధరించి దుష్ణశిక్షణ.. శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

తాజాగా నాగ్ అశ్విన్ కూడా  కాన్సెప్ట్ కు శంబల, కాంప్లెక్స్, మన పురాతన నగరం కాశీ నేపథ్యంలో ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, మన పురాణాలను మిళితం చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. అందులో సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామా పాత్రను మెయిన్ గా ఈ సినిమా కోసం తీసుకున్నారు. మొత్తంగా నాగ్ అశ్విన్ చేసిన ఈ ప్రయోగం ఏ మేరకు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి.

Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News