Vishwak Sen: అమ్మా.. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు.. రాసిపెట్టుకో: విశ్వక్‌ సేన్‌

Vishwak Sen speech at AVAK Pre Release Event. మంగళవారం సాయంత్రం ఖమ్మంలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఆ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 02:16 PM IST
  • ఏవీఏకే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
  • అమ్మా.. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు
  • మే 6న ప్రేక్షకుల ముందుకు ఏవీఏకే
Vishwak Sen: అమ్మా.. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు.. రాసిపెట్టుకో: విశ్వక్‌ సేన్‌

Vishwak Sen speech at AVAK Pre Release Event: గత రెండు రోజుల నుంచి యువ హీరో విశ్వక్‌ సేన్ పేరు సోషల్ మీడియాలో మార్మొగిపోతుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా ప్రమోషన్స్ కారణంగా అతడు వివాదంలో చిక్కుకోవడమే అందుకు కారణం. ఏవీఏకే ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఫిల్మ్ నగర్ రోడ్డుపై విశ్వక్ సేన్ ప్రాంక్‌ వీడియోను చేయడం, ప్రమోషన్‌ పేరిట రోడ్డుపై న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారనే ఉద్దేశంతో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ డిబెట్‌ నిర్వహించడం, డిబెట్‌లో విశ్వక్‌ సేన్ పాల్గొనడం, డిబెట్‌లో హీరో అసభ్య పదజాలం ఉపయోగించడం, అనంతరం క్షమాపణలు చెప్పడం లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. 

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఖమ్మంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఆ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 'సినిమాలో డైలాగ్స్ బాగుంటాయి. రవి కిరణ్ రాసిన కథ చాలా బాగుంది. నేను బాగా చేయడానికి కారణం అతడే. ఏవీఏకేలో అన్నిరకాల భావోద్వేగాలు చక్కగా వచ్చాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలా ఉంటుంది. అర్జున్‌ కుమార్‌కి సాధారణ జనాల్లానే భయం, అభద్రతా భావం ఎక్కువ. 33 ఏళ్లు వచ్చినా.. ఎన్నో భయాలు, అభద్రతాభావాలతో బతుకుతాడు. మే 6న సినిమా చూడండి' అని విశ్వక్ సేన్ అన్నాడు. 

'నేను చేసింది నాలుగు సినిమాలే. కెరీర్‌ ఆరంభం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా. ఇప్పటివరకు ఎక్కడా ఆ విషయాలు చెప్పలేదు కానీ ఈరోజు చెప్పాలి. హీరో అవుతాని ఇంట్లో చెప్పినప్పుడు అందరిలానే మా కుటుంబం కూడా వద్దంది. మా అమ్మ మాత్రం మొదటి నుంచి నన్ను నమ్మి ప్రోత్సహించారు. ఎంతో కష్టపడి డ్యాన్స్‌, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని.. ఆఫీసుల చుట్టూ తిరిగా. రూ.12 లక్షలు పెట్టి వెళ్లిపోమాకే సినిమా తీస్తే.. ఓ నిర్మాత కొనుగోలు చేసి థియేటర్లలో రిలీజ్‌ చేశారు. ఆరోజు సక్సెస్‌ ఇదే అనిపించింది. తరుణ్ భాస్కర్ నన్ను నమ్మి సినిమా చేశారు. అభిమానులకు చాలా థాంక్స్' అని విశ్వక్ తెలిపాడు. 

'కెరీర్‌ ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి. సమస్యలెదురైనప్పుడు కూడా చిరునవ్వుతో కనిపించడమే అసలు ఎదుగుదల. నన్ను ఎవరో ఏదో అన్నారని, నాకెదో జరుగుతుందని నేనెప్పుడూ బాధపడలేదు. కానీ నాకూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. నేను ఒకరికి మాత్రం సమాధానం చెప్పాలి. ఆమె మా అమ్మ. అమ్మా.. నాకేం కాదు. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు.. రాసిపెట్టుకో. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వరని అంటున్నారు. అలా ఇవ్వకుంటే.. నిన్న ఆ అమ్మాయిని ఏమీ అనకుండా ఎందుకు వస్తా.  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చా.  సోషల్‌ మీడియాలో నన్ను సపోర్ట్‌ చేస్తూ వచ్చిన మెస్సేజ్‌లు చూసి.. నేను సంపాదించిన ఆస్తి ఇది అనిపించింది. కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చింది మీరే. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను. ఈ ఏడాది 3 సినిమాలు ఇస్తా. లవ్ యూ గైస్' అంటూ విశ్వక్‌ సేన్ ఉద్వేగానికి గురయ్యాడు.

Also Read: Tanushree Dutta Accident: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ బాలకృష్ణ హీరోయిన్.. మోకాలికి తీవ్ర గాయం!

Also Read: Livingstone Six: బాప్‌రే.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో భారీ సిక్సర్‌! లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News