Vishwak Sen: గామి సినిమా విజయోత్సాహంతో ఉన్న యువ నటుడు విశ్వక్ సేన్ తిరుమల సన్నిధికి చేరుకున్నాడు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండకింద తిరుపతిలో బుధవారం విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక విషయాలు పంచుకున్నాడు. అనంతరం 'ఎక్స్' వేదికగా కూడా ఒక పోస్టు చేశారు. 'గామి' సినిమా విజయంపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.
Also Read: Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియో అప్పుడు లక్షన్నర.. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా?
తిరుపతి సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'గామి సినిమాకు మేము అనుకున్న దానికన్నా మంచి సపోర్ట్ వచ్చింది. అందరూ ఆదరించారు అందరికీ ధన్యవాదాలు. కమర్షియల్ సినిమాతో రావడం లేదు. కొత్త కంటెంట్ కావాలనుకున్న వారికి చాలా బాగుంటుంది ఈ సినిమా. చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు. మా టీమ్ మొత్తం ఒక ఏజీ కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాం. అనేక సంవత్సరాలపాటు కొత్త సినిమా తీయడానికి చాలా శ్రమించాం' అని తెలిపారు.
Also Read: Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్
'ఇటువంటి సినిమా గతంలో ఎన్నడూ రాలేదు. చాలా గర్వంగా ఉంది. పది, 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. గామి సినిమా నచ్చని వాళ్లకు కూడా నచ్చుతుంది. కన్ఫ్యూజ్ అవుతుందని కొంతమంది అంటున్నారు ఎందుకు అలా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అఘోర క్యారెక్టర్ నేను చేయలేనేమో అనిపించింది. అలాంటిదే ట్రై చేస్తాను అనిపించింది' అని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇక తదుపరి సినిమా 'గ్యాంగ్స్ ఫ్రమ్ గోదావరి'పై స్పందిస్తూ.. ఆ సినిమా మేలో విడుదల అవుతుందని ప్రకటించారు. ఆ సినిమా చాలా కొత్తదనంతో వస్తోందని వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో నాకు ప్రతి సినిమా ఒక ప్రయాణంలాంటిది. చుట్టూ ఉండే పరిస్థితుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నా. ఈసారి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఇదే మాదిరి అందరినీ అలరిస్తూ ముందుకు వెళ్తా. సినిమాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అని విశ్వక్ 'ఎక్స్'లో పోస్టు చేశాడు.
ప్రత్యేకమైన కథా నేపథ్యంతో 'గామి' సినిమాను విద్యాధర్ తెరకెక్కించాడు. కార్తీక్ శబరీష్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది. మార్చి 8వ తేదీన థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. కలెక్షన్ల పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దూసుకెళ్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి