Matti Kusthi Promotions: మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్

Vishnu Vishal about Jwala Gutta విష్ణు విశాల్ గుత్తా జ్వాలా గత ఏడాది వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విష్ణు విశాల్ తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గుత్తా జ్వాల గురించి చెప్పుకొచ్చాడు. గుత్తా జ్వాలా మాటలను మొదట్లో నమ్మేవాడు కాదట.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 02:29 PM IST
  • డిసెంబర్ 2న రాబోతోన్న మట్టికుస్తీ
  • గుత్తాజ్వాలపై విష్ణు విశాల్ కామెంట్స్
  • మొదటి పెళ్లి, విడాకులపై ఓపెన్ అయిన హీరో
Matti Kusthi Promotions: మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్

Vishnu Vishal Matti Kusthi movie & Jwala Gutta : విష్ణు విశాల్ ప్రస్తుతం నిర్మాతగా, హీరోగా ఎంతో బిజీగా ఉన్నాడు. తెలుగులో అయితే రవితేజతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. విష్ణు విశాల్ సినిమాలను రవితేజ తెలుగులోకి తీసుకొస్తున్నాడు. అలానే గత ఏడాది FIR అనే చిత్రం వచ్చింది. ఇప్పుడు మట్టి కుస్తీ అనే చిత్రం రాబోతోంది. ఇదేమీ స్పోర్ట్స్ డ్రామా కాదని, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఈగో వంటి చుట్టూ తిరుగుతుందని విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు. ప్రతీ ఒక్కరికి రిలేట్ అయ్యే కథ అని, సంసారంలో వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్య జరిగే సహజమైన విషయాల చుట్టే కథ ఉంటుందని అన్నాడు.

ఈ కథ విన్నప్పుడే తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించాడట విష్ణు విశాల్. ఇలాంటి కథలు మామూలుగా అన్ని చోట్లా వర్కవుట్ అవుతాయని, అందుకే ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్. ఏ జంటకైనా, ఏ భార్యాభర్తల మధ్యనైనా సమస్యలు వస్తాయని, ఇగోలు ఉంటాయని అన్న విష్ణు విశాల్.. తన మొదటి పెళ్లి, విడాకుల గురించి స్పందించాడు.

నా మొదటి పెళ్లి విడాకులతో ముగిసింది.. అప్పుడు కొన్ని తప్పులు జరిగాయి.. ఆమెను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానో.. నన్ను ఆమె సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందో.. ఆమె ఆశించింది నేను చేయలేకపోయానో.. నా ఒత్తిడి, నా కోపం అనవసరంగా ఆమె మీద చూపించానో.. ఇలా చాలా తప్పులు జరిగాయి.. ఇప్పుడు చాలా నేర్చుకున్నాను.. అంటూ విష్ణు విశాల్ తన మొదటి పెళ్లి, విడాకుల మీద స్పందించాడు.

గుత్తా జ్వాలా మాత్రం తనను అర్థం చేసుకుందని, సినిమాల రిలీజ్ టైంలో తాను ఎలా ఉంటానో దగ్గరుండి చూస్తోందని చెప్పుకొచ్చాడు. ఇక గుత్తా జ్వాలా అయితే సినిమాల మీద చెప్పే అభిప్రాయాలు ఎంతో కచ్చితంగా ఉంటాయని అన్నాడు. మొదట్లో గుత్తా జ్వాలా ఊరికే చెబుతోందేమో అని అనుకున్నాడట. అందుకే ఆమె మాటలు నమ్మేవాడు కాదట. అంతగా పట్టించుకునేవాడు కాదట. కానీ ఆమె చెప్పినట్టుగానే రిజల్ట్ వచ్చేదట.

ఆమె ఎక్కువగా సినిమాలు చూస్తుందట. ఉదయం మొదలు పెడితే.. రాత్రి పడుకునే వరకు సినిమాలు చూస్తూనే ఉంటుందట. థియేటర్, ఓటీటీ, మొబైల్ ఫోన్ ఇలా అన్నిచోట్ల సినిమాలు చూస్తూనే ఉంటుందట. ఆమె ఆడియన్స్ యాంగిల్‌లో సినిమా చూస్తుందని, ఆమె చెప్పినట్టుగానే సినిమా రిజల్ట్ వస్తోందని, ఈ మట్టి కుస్తీ షూర్ షాట్ హిట్ అవుతుందని రివ్యూ ఇచ్చేసిందట.

Also Read : Jabardasth Satya : జబర్దస్త్‌కు తిరిగి వచ్చిన సత్య శ్రీ.. చమ్మక్ చంద్రతో విబేధాలే కారణమా?

Also Read : Jabardasth Varsha in Saree : వామ్మో వర్ష ఇలా వంగిపోయిందంటే?.. కిటికీల జాకెట్‌తో అందాల ప్రదర్శన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News