Virat Kohli - Tamannaah: తమన్నా, విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ సమ్‌థింగ్.. సమ్‌థింగ్..? జాగ్రత్త అనుష్క అంటూ పోస్టులు!

Virat Kohli, Tamannaah Video got Viral in Social Media: తమన్నా భాటియా, విరాట్ కోహ్లీ గతంలో డేటింగ్ చేసుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ముందుగా విరాట్ కోహ్లీ, తమన్నా భాటియా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగా పుకార్లు షికార్లు చేశాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2023, 12:04 PM IST
Virat Kohli - Tamannaah: తమన్నా, విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ సమ్‌థింగ్.. సమ్‌థింగ్..? జాగ్రత్త అనుష్క అంటూ పోస్టులు!

  Virat Kohli, Tamannaah Video got Viral in Social Media: తమన్నా భాటియా, విరాట్ కోహ్లీ గతంలో డేటింగ్ చేసుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ముందుగా విరాట్ కోహ్లీ, తమన్నా భాటియా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగా పుకార్లు షికార్లు చేశాయి. సెల్ ఫోన్‌కి సంబంధించిన ఒక పాత టీవీ అడ్వర్టైజ్‌మెంట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తమన్నా భాటియాను ఆటపట్టిస్తూ కవ్వించే ప్రయత్నం చేయడం, తమన్నా సైతం అతడి చేష్టలకు పడిపోయినట్టుగా స్మైల్ ఇవ్వడం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో కింద నెటిజెన్స్ తమదైన స్టైల్లో కామెంట్స్ రాస్తున్నారు. అనుష్కా శర్మను ట్యాగ్ చేసిన నెటిజెన్స్... " విరాట్ భాయ్ తమన్నా మాయలో పడిపోతున్నాడు జాగ్రత్త బాబీ " అంటూ అనుష్కా శర్మను ఆటపట్టిస్తున్నారు. ఇంకొంత మంది నెటిజెన్స్ అనుష్క శర్మను ట్యాగ్ చేస్తూ.. " హలో అనుష్క, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి " అంటూ కామెంట్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీతో డేటింగ్ చేస్తున్నట్టుగా వచ్చిన రూమర్స్‌పై అప్పట్లో తమన్నా భాటియా స్పందిస్తూ.. విరాట్ కోహ్లీతో కలిసి అడ్వర్టైజ్‌మెంట్‌లో నటించేటప్పుడు షూటింగ్ సమయంలో ఆయన నాలుగు ముక్కలే మాట్లాడాడని.. అంత మాత్రానికే రూమర్స్ అల్లేస్తారా అని ప్రశ్నించింది. ఏదేమైనా విరాట్ కోహ్లీ తాను చూసిన ఎంతో మంది నటుల కంటే మంచి నటుడు అని విరాట్ కోహ్లీ యాక్టింగ్ స్కిల్స్‌ని అభినందించింది.

ఇది కూడా చదవండి: Lust Stories 2 Trailer: లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్.. పెళ్లికి ముందు ట్రయల్ రన్.. పెళ్లి తరువాత ఫుల్ రన్ పైనే మొత్తం ఫోకస్

ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో తనతో కలిసి నటించిన విజయ్ వర్మతో తాను ప్రేమలో పడినట్టు అంగీకరించిన తమన్నా భాటీయా.. తాను అతడితో కలిసి ఉంటే హ్యీపీగా ఫీల్ అవుతాను అని చెప్పుకొచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కోస్టార్ కనుకే అతడిలో ప్రేమలా పడ్డావా అని మీడియా అడిగిన ప్రశ్నకు తమన్నా కూడా అంతే తెలివిగా రిప్లై ఇచ్చింది. తన ఇన్నేళ్ల కెరీర్లో ఎంతో మందితో కలిసి పనిచేశానని.. కలిసి పనిచేసిన ప్రతీ కోస్టార్‌తో ప్రేమలో పడితే అలా ఇప్పటికే ఎంతోమందితో కలిసి పనిచేశాను.. మరి అంత మందితో ప్రేమలో పడ్డానా అని ప్రశ్నించింది. విజయ్ వర్మ సైతం తమన్నా భాటియా పట్ల తెగ ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Varun Sandesh: హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు, కానిస్టేబుల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News