Kohli- Anushka Total Net Worth: విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Virat Kohli, Anushka Sharma Total Net Worth: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ.. ఇద్దరూ కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు.. ఇద్దరూ కూడా రెండు చేతులా సంపాదించే రంగాల్లో సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న వారే. మరి ఆ ఇద్దరూ కలిసి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, ఆ ఇద్దరికి ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. ఆ డీటేల్స్ తెలుసుకోవాలంటే మనం ఇంకొంత ముందుకు వెళ్లాల్సిందే.

Written by - Pavan | Last Updated : Jun 27, 2023, 10:26 AM IST
Kohli- Anushka Total Net Worth: విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Virat Kohli Total net Worth in Rupees 2023: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ.. ఇద్దరూ కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు.. ఫేమస్ సెలబ్రిటీలు కూడా. ఒకరిది క్రీడా ప్రపంచమైతే.. మరొకరిది వినోద పరిశ్రమ. ఇద్దరూ కూడా రెండు చేతులా సంపాదించే రంగాల్లో సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న వారే. మరి ఆ ఇద్దరూ కలిసి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారో.. ఏయే మార్గాల్లో ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందిలో ఉంటుంది. ఆ ఇద్దరి సంపాదన ఎంత, ఆ ఇద్దరికి ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ డీటేల్స్ తెలుసుకోవాలంటే మనం ఇంకొంత ముందుకు వెళ్లాల్సిందే.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం టీమిండియా మాజీ కేప్టేన్ విరాట్ కోహ్లీ నెట్‌వర్త్ ఎంతో తెలుసా ? అక్షరాల రూ. 1050 కోట్లు. అవును విరాట్ కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ రూ. 1050 కోట్లు ఉంటుంది అని ఒక అంచనా చెబుతోంది.

విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడటం ద్వారా ఎంత సంపాదిస్తాడో తెలుసా ? విరాట్ కోహ్లీ ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడితే 15 లక్షలు, వన్డే మ్యాచ్ ఆడితే రూ. 7 లక్షలు సంపాదిస్తాడు. ఇక ఐపిఎల్ సంగతి చెప్పనక్కరేలేదు. ఐపిఎల్‌లో విరాట్ కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 15 కోట్లు చెల్లిస్తోంది. 

బీసీసీఐ నుంచి వచ్చే ఆదాయం ఎంతంటే..
టెస్ట్ మ్యాచులు, వన్డే మ్యాచులు, ఐపిఎల్ మ్యాచులే కాకుండా.. ప్రతీ సంవత్సరం బీసీసీఐతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం విరాట్ కోహ్లీకి రూ. 7 కోట్లు పారితోషికం కింద అందుతుంది. 

ఇది కూడా చదవండి: Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో.. కుర్రకారుకు నిద్ర పట్టేనా..?

ఎన్నో కంపెనీలకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్
విరాట్ కోహ్లీ ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన ఉత్పత్తులు, ఎనర్జి డ్రింక్స్ అండ్ ఫుడ్స్ వంటి ఉత్పత్తులు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలకు విరాట్ కోహ్లీ బ్రాండ్ ఎండార్సింగ్ చేస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా విరాట్ కోహ్లీ ఏ నెలకు ఆ నెల కనీసం రూ. 7.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.

రూ. 110 కోట్ల విలువైన ప్రాపర్టీలు
విరాట్ కోహ్లీకి ముంబైలో ఒక ఇల్లు, దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లో ఒక ఇల్లు ఉన్నాయి. ఈ రెండు బంగ్లాల విలువ మొత్తం రూ. 110 కోట్లు ఉంటుంది అని ఒక అంచనా.

విరాట్ కోహ్లీ బెటర్ హాఫ్ అనుష్కా శర్మ నెట్‌వర్త్ రూ. 255 కోట్లు     
విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ నెట్‌వర్త్ రూ. 255 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: Odisha Bus Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం

సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ప్లస్ ప్రొడక్షన్ హౌజ్
అనుష్క శర్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అడపాదడపా వివిధ రకాల ఉత్పత్తుల అడ్వర్టైజ్‌మెంట్స్‌కి సైతం సైన్ చేస్తోంది. ఇవేకాకుండా అనుష్క శర్మకు సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్ కూడా ఉంది. ఇలా మూడు రకాల మార్గాల్లో అనుష్క శర్మకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది.

కోట్ల విలువ చేసే కార్లు, బంగ్లాలు
అనుష్కా శర్మ వద్ద కోట్ల విలువ చేసే కార్లు, బంగ్లాలు ఉన్నాయి. ఆమె ప్రాపర్టీ విలువ రూ. 53 కోట్లు ఉండగా.. ఆమె వద్ద ఉన్న కార్ల కలెక్షన్ విలువ రూ. 10 నుంచి 12 కోట్ల వరకు ఉంటుంది అని ఒక అంచనా చెబుతోంది. 

అలా విరాట్ కోహ్లీ వద్ద రూ. 1050 కోట్ల నెట్‌వర్త్, అనుష్కా శర్మ వద్ద ఉన్న రూ. 255 కోట్ల నెట్‌వర్త్ కలిపి మొత్తు రూ. 1305 కోట్ల వరకు ఇద్దరి నెట్వర్త్ ఉంటుంది అని అంచనాలు చెబుతున్నాయి. ఇదంతా మార్కెట్ విలువ ప్రకారమే అయినప్పటికీ.. అసలు విలువ ఇంతకు రెట్టింపు కూడా ఉండొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, సెలబ్రిటీలు చాలా మంది తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొంత మంది హోటల్ బిజినెస్‌లో.. ఇంకొంతమంది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పైగా ఎండార్స్‌మెంట్స్ రూపంలో వచ్చే ఆదాయానికి ఒక లెక్క, విలువ కట్టడం కూడా కష్టమే. అందుకే నిత్యం బిజీగా ఉండే విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ లాంటి సెలబ్రిటీల ఆస్తులు ఏ రోజుకు ఆరోజు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గేదే లేదు.

ఇది కూడా చదవండి : Ram Charan, Upasana Kamineni: తమ గారాలపట్టితో తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన రామ్ చరణ్, ఉపాసన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News