Viraaji: ఆడియన్స్ కు విరాజి మూవీ బంపరాఫర్.. మల్టీప్లెక్స్ రూ. 125.. సింగిల్ స్క్రీన్స్ లో రూ.99..

Viraaji Ticket Rates:గత కొన్నేళ్లుగా పెంచిన టికెట్ రేట్స్ మధ్య తరగతి వాల్లు థియేటర్స్ కు దూరమయ్యారు. ఏదో కల్కి లాంటి బడా సినిమాలకు వస్తేనే థియేటర్స్ వైపు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్ని సినిమాలు పెంచిన టికెట్ రేట్స్ తో చితికి పోతున్నాయి. తాజాగా విరాజి సినిమా యూనిట్ తమ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా తగ్గించిన టికెట్ రేట్స్ తో సినిమాలను విడుదల చేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 31, 2024, 07:50 AM IST
Viraaji: ఆడియన్స్ కు విరాజి మూవీ బంపరాఫర్.. మల్టీప్లెక్స్ రూ. 125.. సింగిల్ స్క్రీన్స్ లో రూ.99..

Viraaji Ticket Rates: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాజి’. హార్రర్ నేపథ్యంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మహేంద్రనాథ్  కూండ్ల నిర్మించారు. ఆగష్టు 2న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు ఒకటే రేట్స్ ఉండటంతో చిన్న సినిమాలు చితికి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘విరాజి’ మూవీ యూనిట్ తమ సినిమాలను ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా తమ సినిమా టికెట్ రేట్స్ ను తగ్గించాయి. మల్టీప్లెక్స్ లో ఈ సినిమా టికెట్ రేట్ ను రూ. 125కు.. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 99 కే అమ్ముతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.

తాజాగా  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ - "విరాజి" మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ జూలై 2న చేశాము. ఆగస్టు 2న రిలీజ్ అని ఆ రోజే చెప్పాము. సరిగ్గా నెల రోజులు ప్రమోషన్స్ కు పెట్టుకుని అనుకున్న టైమ్ కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సింగిల్ స్క్రీన్స్ కు 99 రూపాయలు, మల్టీప్లెక్సులకు 125 రూపాయలుగా టికెట్ రేట్లు ఉండబోతున్నట్టు ప్రకటించారు. మా మూవీకి వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పించేందుకు టికెట్ రేట్లు తగ్గించినట్టు చెప్పారు.

దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ - మా "విరాజి" సినిమాకు సపోర్ట్ అందిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా నా 37 ఏళ్ల కష్టం. "విరాజి" సినిమాకు మెయిన్ ఫిల్లర్ గా ఉన్నది మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్. ఆయన ఒక టెక్నీషియన్ లా ఈ సినిమాకు పనిచేశారు. ప్రమోషన్స్ మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. నాకు ప్రతి విషయంలో ఎంతో సపోర్టివ్ గా ఉన్నారన్నారు. వరుణ్ సందేశ్ ఎంతో మనసు పెట్టి ఈ సినిమాను చేశారు. విరాజి మూవీ సోషల్ ఎలిమెంట్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకొచ్చారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -
డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" స్టోరీని చెబుతుంటే  గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ ఆద్యంత్ హర్షకు ధన్యవాదాలు  చెబుతున్నాను. అంత బాగా నెరేట్ చేశాడు. నా క్యారెక్టర్ మేకోవర్ దగ్గర నుంచి ప్రతీది కొత్తగా తెరకెక్కించాడు. ఈ సినిమా  ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. తక్కువ టికెట్ రేట్స్ తో  ఆగస్టు 2న థియేటర్స్ లో మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్నారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News