Vinaro Bhagyamu VishnuKatha postponed: చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలు అయినా ఈ మధ్యకాలంలో పోటాపోటీగా రిలీజ్ అవుతున్న దాఖలాలు చాలా తక్కువ అయ్యాయి. థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో నిర్మాతలు కూర్చొని మాట్లాడుకుని మరీ రిలీజ్ డేట్ లో ప్రకటిస్తున్నారు, అవసరం అనుకుంటే వాయిదా వేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ఈ వారం విడుదల కావాల్సిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కిరణ్ అబ్బవరం హీరోగా మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, పమ్మి సాయి, ప్రవీణ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. వాస్తవానికి ఈ సినిమాని 17 ఫిబ్రవరి 2023వ సంవత్సరంలో విడుదల చేయాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఒకరోజు వాయిదా వేసి 18వ తేదీ అంటే శనివారం నాడు విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే పైకి మాత్రం గీతా ఆర్ట్స్ కి శనివారం రిలీజ్ చేస్తే సెంటిమెంట్ కలిసొస్తుంది కాబట్టి వాయిదా వేశామని చెబుతున్నా అసలు విషయం మరోటి ఉందట. అది ఏమిటంటే అదే రోజున ధనుష్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వాతి అనే సినిమా తెరకెక్కించారు. తెలుగులో దాన్ని సార్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ ఒక లెక్చరర్ పాత్రలో కనిపిస్తుండగా ఆయన ప్రియురాలి పాత్రలో సంయుక్త మీనన్ నటిస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 17వ తేదీనే విడుదలవుతోంది. ఆ సినిమా కోసమే ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ సినిమా యూనిట్ తమ సినిమాని ఒక రోజు వెనక్కి వాయిదా వేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Vedha OTT release: నిన్న థియేటర్లో నేడు ఓటీటీలో 'వేద'.. ఎందులో స్ట్రీమ్ అవుతుందో తెలుసా?
Also Read: Case Filed on Rana: రానా, సురేష్ బాబులపై కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook