Vijay Devarakonda Next Movie : విజయ్ దేవరకొండ టైం ఏ మాత్రం బాగోలేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలుస్తోంది. ఖుషి సినిమాతో కొంచెం పర్వాలేదు అనిపించినప్పటికీ.. ఆ కాస్త ఆనందం కూడా ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిజల్ట్ తో పూర్తిగాపోయింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ది ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద మరొక భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ తన నెక్ట్స్ సినిమాల మీద పెట్టుకున్నాడు. ప్రస్తుతం విజయ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి.. దర్శకత్వంలో ఒక ప్యాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. జెర్సీ సినిమాతో నానికి హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండకి కూడా మర్చిపోలేని హిట్ ఇస్తారని ఫాన్స్ ఆశిస్తున్నారు. రవి కిరణ్ కోలాతో దిల్ రాజు నిర్మించబోతున్న ఒక సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఒక కొత్త జోనర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ రెండు సినిమాలు పక్కన పెడితే విజయ్ దేవరకొండ..రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గతంలో టాక్సీవాలా వంటి హారర్ సినిమాతో తనకి మంచి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ తో సినిమా కాబట్టి విజయ్ దేవరకొండ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తూ రిస్క్ తీసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ద్విపాత్రాభినయం చేయడం రిస్క్ కాదు. స్టార్ హీరోల నుండి మీడియం హీరోలదాకా ఇప్పటికే చాలామంది ద్విపాత్రాభినయం చేశారు. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో త్రిపాత్రాభినయం కూడా చేసేసారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రిగా కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ముసలి వాళ్ళ గెటప్ లో తండ్రి పాత్ర పోషించిన చాలామంది హీరోలు కొడుకు పాత్రలో మళ్ళీ యంగ్ గా కనిపిస్తారు. నిజానికి ఈ కథాంశం పాత సినిమాలలో ఉండేది కానీ ఇప్పుడు ఇలాంటి రొటీన్ ఫార్ములాల మీద ప్రేక్షకులు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఆఖరిసారిగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. కానీ యువ హీరోలు మాత్రం ఈ రిస్కులు తీసుకోవడానికి ముందుకు రాలేదు. అలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ ఇలాంటి రిస్క్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఇలా కొత్త జోనర్ లో విజయ్ దేవరకొండ సినిమాలు చేయడం బాగానే ఉంది. కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవాల్సిన ఈ టైంలో విజయ్ దేవరకొండ ఇలాంటి రిస్కీ సినిమాలు చేయడం ఎంతవరకు మంచిది అని మాత్రం ఫ్యాన్స్ కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు.
Also read: 4th Phase Lok Sabha Polls 2024: నేటితో తెలంగాణ, ఏపీ సహా 4వ విడత ఎన్నికల ప్రచారానికి ముగింపు..
Also read: AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook