Vijay Deverakonda Birthday Special: విజయ్ దేవరకొండకు అవార్డ్ అమ్మాల్సినంత అవసరం ఏమొచ్చింది ?

Vijay Deverakonda Birthday Special: విజయ్ దేవరకొండ.. స్టార్ హీరో అయినప్పటికీ.. విజయ్ దేవరకొండ రియల్ లైఫ్‌లో సూత్రధార్ థియేటర్ గ్రూప్ నుంచి అవార్డ్ అమ్మేయడం వరకు ఆసక్తికరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్ హీరో గురించి తెలియని ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం రండి. 

Written by - Pavan | Last Updated : May 8, 2023, 08:23 PM IST
Vijay Deverakonda Birthday Special: విజయ్ దేవరకొండకు అవార్డ్ అమ్మాల్సినంత అవసరం ఏమొచ్చింది ?

Vijay Deverakonda Birthday Special: విజయ్ దేవరకొండ.. ఈ పేరు వింటే అభిమానులకు ఏదో తెలియని ఎనర్జి. సింపుల్ బ్యాగ్రౌండ్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోల సరసన చేరిన విజయ్ దేవరకొండకు ఆ స్టార్ హీరో స్టేటస్ అంత తేలిగ్గా రాలేదు. అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు. అందివచ్చిన ప్రతీ ఒక్క అవకాశాన్ని కాదనకుండా అందిపుచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో మొత్తానికి ఎవ్వరూ ఊహించని రీతిలో నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ బేస్ సంపాదించుకుని ప్యాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. అయితే, అంత స్టార్ హీరో అయినప్పటికీ.. విజయ్ దేవరకొండ రియల్ లైఫ్‌లో చాలామందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్ హీరో గురించి తెలియని ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.  

ప్రస్తుతం ప్యాన్ ఇండియా క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండకు యాక్టింగ్ అంటే ఎంత క్రేజ్ అంటే.. సినిమాల్లోకి రావాలన్న తన కలను నెరవేర్చుకోవడం కోసం ఓవైపు సినిమాల్లో ట్రై చేస్తూనే.. మరోవైపు థియేటర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్‌ని ఆరంభించాడు. ఫిలిం స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నా.. నేర్చుకోకపోయినా.. నేరుగా సినిమాల్లోనే అవకాశాల కోసం రోజుల తరబడి వేచిచూసి తమ లైఫ్‌ని రిస్కులో పెడుతున్న యువత ఉన్న ఈ రోజుల్లో విజయ్ దేవరకొండ ఒక్క చోట ఆగిపోకుండా సూత్రధార్ అనే గ్రూప్‌తో కలిసి థియేటర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ఆరంభించాడు. ఆ తరువాత సినిమాల్లో రాణించాడు. 

విజయ్ దేవరకొండ తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావు టెలివిజన్ పరిశ్రమలో టీవీ డైరెక్టర్‌గా పనిచేశారు. టీవీ పరిశ్రమ, క్రియేటివిటీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ.. విజయ్ దేవరకొండ మాత్రం తన ప్రతిభతో తనే తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ ఎంతో స్ట్రగుల్ అయ్యాడు.

చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ తనకు అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చిన బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డుని వేలం వేసి రూ. 25 లక్షలకు అమ్మేశాడు. అలా వచ్చిన రూ. 25 లక్షల రూపాయలను ఆపత్కాలంలో ప్రజా సేవ కోసం ప్రభుత్వం ఉపయోగించే సీఎం రిలిఫ్ ఫండ్‌కి విరాళంగా అందించిన గొప్ప మనసున్న హీరో మన విజయ్ దేవరకొండ. 

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ స్టార్ హీరోకు లేని ప్రత్యేకత విజయ్ దేవరకొండకు మాత్రమే సొంతమైన ప్రత్యేకత మరొకటి ఉంది. ప్రతీ ఏడాదికి ఒకసారి తన అభిమానుల్లో ఒక 100 మందిని దేవర సంత పేరిట సెలెక్ట్ చేసి వారిని సరదాగా జాలీగా ఏదైనా టూరిజం ట్రిప్‌కి పంపించడం విజయ్ దేవరకొండ ప్రత్యేకత. ఈ ఏడాది తన అభిమానులను మనాలికి పంపించిన సంగతి తెలిసిందే.

అర్జున్ రెడ్డి సినిమాతో ఎనలేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ 2019 లో ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

ఇది కూడా చదవండి : Top CEOs' Salary: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ శాలరీ ఎంతో తెలిస్తే షాకవుతారు

'ది రౌడీ వేర్' పేరుతో విజయ్ దేవరకొండ సొంతంగా ఓ క్లాతింగ్ బ్రాండ్ స్థాపించాడు. తన క్లాతింగ్ బ్రాండ్‌కి ఆ పేరు పెట్టడానికి కారణం విజయ్ దేవరకొండ తన అభిమానులను సరదాగా రౌడీస్ అని పిలుచుకోవడమే అనే సంగతి తెలిసిందే. ఏదేమైనా.. సింపుల్ హీరోగా వచ్చి.. స్టార్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ రేపు మే 9న తన 34వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా జీ తెలుగు న్యూస్ తరపున, అభిమానుల తరుపున విజయ్ దేవరకొండకు హ్యాపీ బర్త్ డే.. 

ఇది కూడా చదవండి : iPhone 14 Best Price: అమేజాన్ vs ఫ్లిప్‌కార్ట్ vs విజయ్ సేల్స్.. మూడింట్లో ఎక్కడ తక్కువ ధర ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News