ఏ మంత్రం వేసావె.. ఫస్ట్ లుక్ విడుదల

  

Last Updated : Oct 19, 2017, 12:46 PM IST
ఏ మంత్రం వేసావె.. ఫస్ట్ లుక్ విడుదల
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ. పెళ్ళిచూపులు, ద్వారక లాంటి సినిమాలతో యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్, అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌‌లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విజయ్ లేటెస్ట్‌గా "ఏ మంత్రం వేసావె" అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీధర్‌ మర్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు నిర్మాతలు. కథానాయకుడు ఏదో ఆలోచనలో తేలియాడుతున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Trending News