Vijay Devarakonda: ట్విట్టర్ ఖాతా పేరు మార్చిన విజయ్ దేవరకొండ...కారణమేంటంటే..!!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతా పేరును మార్చాడు. దీనికి కారణమేంటా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 12:48 PM IST
  • సోషల్ మీడియాలో పేరు మార్చిన విజయ్
  • ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్న రౌడీ హీరో
Vijay Devarakonda: ట్విట్టర్ ఖాతా పేరు మార్చిన విజయ్ దేవరకొండ...కారణమేంటంటే..!!

Vijay Devarakonda: అర్జున్ రెడ్డితో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఇప్పుడు లైగర్ మూవీ చేస్తూ... ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించాడు. సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్ గా ఉండే ఈ హీరోను..అనేక మంది పాలో అవుతూ ఉంటారు. రౌడీ హీరో సినిమా అప్ డేట్స్, వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తూంటారు.

తాజాగా విజయ్ తన ట్విట్టర్ ఖాతా (Vijay Devarakonda Twitter Account)  పేరు మార్చి ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ పక్కన తుఫాన్ (Toofan) అనే పదాన్ని యాడ్ చేశాడు. ఇంకేముంది నెటిజన్లు పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఇలా పేరు మార్చడానికి కారణమేంటని ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవల సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం విజయ్ దేవరకొండ ఇచ్చిన ఓ ఫోజ్‏కు తుఫాన్ అనే ట్యాగ్ కనిపించింది. అదే విజయ్ పేరు మార్చడానికి కారణమై ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ (Liger Movie) చేస్తున్నాడు విజయ్.  ఇతడి సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Nagarjuna: అది పూర్తిగా అవాస్తవం.. దయచేసి రూమర్స్ ప్రచారం చేయొద్దు.. నాగార్జున విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News