Kushi All Languages Non-Theatrical Rights sold out for 90 Crores: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రలలో నటించారు.
ఈ సినిమా భారీ హిట్ గా నిలుస్తుందని అనుకుంటే భారీ డిజాస్టర్ గా నిలిచి అటు పూరి జగన్నాథ్, ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరికీ తీరని నష్టాన్ని మిగిల్చింది. అయితే ఈ సినిమా ప్రభావం విజయ్ దేవరకొండ తదుపరి సినిమా మీద ఉంటుందని అందరూ అనుకుంటే అది ఏమాత్రం లేదనే తెలుస్తోంది. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమా రూపొందుతోంది. శివా నిర్వాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత రెమ్యూనరేషన్ కాకుండా పెద్దగా నిర్మాతలు ఖర్చు పెట్టిందేమీ లేదు. అయితే విజయ్ దేవరకొండకు సమంతకు నార్త్ లో ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాకు 90 కోట్ల దాకా హక్కులు వచ్చాయని ఇప్పటికే ఈ రైట్స్ అమ్మకం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది.
సమంత అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇంకా ఐదు వారాల షూటింగ్ చేస్తేనే సినిమా పూర్తవుతుంది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ సమంత అనారోగ్యం దృష్ట్యా సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫిబ్రవరిలో థియేటర్లు దొరికే అవకాశం లేదని పెద్ద ఎత్తున సినిమాల లైన్ లో ఉండడంతో ఈ సినిమాని వేసవికి వాయిదా వేసినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.
మొత్తం మీద ఈ సినిమా రైట్స్ కొనుగోలు వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ మార్కెట్ బలహీన పడటంతో ఈ సినిమా హక్కులు అమ్మడం ఇబ్బందికరమని మేకర్స్ భావించారు కానీ అన్ని భాషల్లోనూ మంచి రేటుకే అమ్ముడుపోవడం మంచి పరిణామమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Ram Charan Fans: ఆర్సీ 15ని వదిలేసిన శంకర్.. టెన్షన్లో చెర్రీ ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook