Vijay Devarakonda Remuneration for Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి.. సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న అన్ని భాషల్లోనూ విడుదలైంది. మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు మొత మోగిస్తున్న ఈ సినిమా.. రోజుకి ఒక కొత్త రికార్డు చొప్పున బ్రేక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో చాలామంది స్టార్ లు క్యామియో పాత్రలలో.. కూడా కనిపించి ప్రేక్షకులను అలారించారు. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో చిన్న కామియో పాత్రలో కనిపించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే మహాభారతం ఎపిసోడ్లో.. విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో ప్రేక్షకులకి దర్శనమిచ్చారు
ఇప్పటిదాకా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన.. మూడు సినిమాల్లోనూ కామన్ గా ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ హీరో పాత్రలో.. కనిపించిన విజయ్ దేవరకొండ మహానటి సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇక కల్కి సినిమాలో.. కూడా క్యామియో పాత్ర అయినప్పటికీ విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ తో చేసిన మూడవ సినిమా ఇది.
నాగ్ అశ్విన్ కి తనకి ఎప్పటినుంచో.. మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే నాగ్ అశ్విన్ ప్రభాస్ ల కోసమే.. తాను ఈ సినిమాలో నటించానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. అంటే ఈ సినిమాలో తన క్యామియో పాత్ర కోసం విజయ్ దేవరకొండ ఒక రూపాయి కూడా తీసుకోలేదట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ తను నాగ్ అశ్విన్, ప్రభాస్ ల కోసమే సినిమా చేశానని చెప్పారు.
మరోవైపు సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ 150 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకోగా అమితాబచ్చన్, దీపికా పడుకొనే తలా ఒక 20 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు.
ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల.. గురించి చెప్పాలంటే ప్రస్తుతం విజయ్.. మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న.. విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాతో.. తనకి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. రవికిరణ్ కోల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్.. ఇచ్చారు. మరి తన నెక్స్ట్ సినిమాలతో విజయ్ దేవరకొండ ఎంతవరకు.. హిట్ అందుకుంటాడో వేచి చూడాలి. ఇక కల్కి సీక్వెల్ లో కూడా విజయ్ దేవరకొండ నటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం
Also Read: C Naga Rani IAS: వెస్ట్ గోదావరికి పవర్ ఫుల్ ఆఫీసర్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అందరికీ హడలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి