Vijay Devarakonda : ట్రోల్స్ తోనే సినిమా పబ్లిసిటీ చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..

Family Star : యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ప్రతిరోజు చూసే మీమ్స్ తో తన సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మిర్చి సినిమాలోని ఒక చిన్న వీడియోతో తన రాబోయే సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టి ఇంతకుముందు ఎప్పుడూ చూడని రీతిలో సినిమా గురించి ప్రమోట్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 09:19 AM IST
Vijay Devarakonda : ట్రోల్స్ తోనే సినిమా పబ్లిసిటీ చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda : వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న యువహీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో మరొక భారీ డిజాస్టర్ ను అందుకున్నారు. కొద్దిరోజుల బ్రేక్ తరువాత విజయ్ దేవరకొండ ఈ మధ్యనే సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో విడుదలైన ఖుషి సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మిగతా సినిమాలతో పోలిస్తే ఖుషి సినిమా విజయ్ దేవరకొండ కి, అతని అభిమానులకి కొంత ఊరట ఇచ్చింది అని చెప్పుకోవచ్చు.

తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతుల్లో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే అందులో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో నుంచి ఒక డైలాగ్ వీడియో ని షేర్ చేశారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.

సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అందులో విజయ్ దేవరకొండ చెప్పిన ఒక మాస్ డైలాగ్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. విజయ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల దృష్టి ని బాగా ఆకర్షిస్తోంది. టీజర్ లో "సెటిల్మెంట్ అంటే ఉల్లిపాయలు తేవడం, టైం కి లేచి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయడం అని అనుకుంటున్నావా?" అని విలన్ ఎగతాళిగా అడగగా, "భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఉల్లిపాయలు కొంటే వాడు మనిషి కాదా? పిల్లల్ని రెడీ చేస్తే వాడు మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?" అంటూ కూల్ గా కౌంటర్ వేస్తాడు విజయ్.

అందులో "ఐరనే వంచాలా ఏంటి" అనే డైలాగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డైలాగ్ ట్రెండ్ అవుతుంది. చాలామంది నెటిజన్లు ఈ డైలాగ్ మీద తెగ మీమ్స్ సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే మిర్చి సినిమాలో కాలకేయ ప్రభాకర్, ప్రభాస్ ల మధ్య జరిగే ఒక సన్నివేశంలో ప్రభాస్ ఈ డైలాగ్ చెబుతున్నట్లు మీమ్ వీడియో మొదలైంది.

ఇంకా ఆసక్తికరంగా ఈ మీమ్ కి సంబంధించిన వీడియో ని విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ "ఇంటర్నెట్ అసలు ఏం నడుస్తుంది" అంటూ ప్రశ్నించారు. ఏదేమైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ కూడా ఇప్పుడు సినిమాకి బీభత్సంగా ప్రమోషన్ లుగా పనికొస్తున్నాయి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News