Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో మరో హీరో.. పవర్ ఫుల్ పాత్రలో..

Vijay Devarakonda Upcoming Movie: ప్రస్తుతం వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్నారు విజయ్ దేవరకొండ. తన రాబోయే సినిమాలతో విజయం సాధించే అవసరం ఈ హీరోకి ఎంతో ఉంది. ఈ క్రమంలో ఈ హీరో తన తదుపరి సినిమాలోకి మరో హీరోని కూడా దింపబోతున్నారు అనే వార్త తెగ వైరల్ గా మారింది

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 31, 2024, 03:13 PM IST
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో మరో హీరో.. పవర్ ఫుల్ పాత్రలో..

Vijay Devarakonda-Gautam Tinnanuri: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈ హీరో లైఫ్.. పెళ్లిచూపులు సినిమాతో పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఈ నను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ సూపర్ స్టార్ చేసింది. ఆ తరువాత టాక్సీవాలా, గీతాగోవిందం లాంటి సినిమాలతో విజయాలు సాధించి రౌడీ స్టార్ గా మారిపోయారు.

కాగా సినిమాల విషయంలోనే కాకుండా రష్మిక విషయంలో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈ హీరో. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ కెరియర్ ఫ్లాప్స్ వైపు మల్లుకుంది. ఖుషి సినిమా మినహా ఆ తర్వాత ఈ హీరోకి ఒక్క విజయం కూడా లేదు. ఖుషి సినిమా విజయం సైతం సమంత క్రెడిట్ లో పడడంతో.. ప్రస్తుతం ఈ హీరోకి విజయం అందుకోవలసిన అవసరం చాలానే ఉంది.

అయితే వరస ఫ్లాపులు వచ్చాయి కానీ ఆఫర్లు మాత్రం మన రౌడీ స్టార్ కి అసలు తగ్గలేదు..విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో అన్ని సినిమాల కన్నా అంచనాలు ఎక్కువగా ఉండేది..జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా పైన అని చెప్పొచ్చు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ స్పై యాక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది అని ఆల్రెడీ తెలిపారు. ఇటీవలే వైజాగ్ లో షూటింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రీలీలని అనౌన్స్ చేశారు. కానీ శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఈ హీరోయిన్, ఈ చిత్రం నుంచి తప్పుకుంది.ఇక  శ్రీలీల స్థానం లో మమిత బైజు, భాగ్యశ్రీ భోర్సే.. పలు పేర్లు వినిపించాయి కానీ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా అయితే క్లారిటీ రాలేదు. తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది‌. అదేమిటంటే ఈ సినిమాలో హీరో సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

సత్యదేవ్ ఇటీవలే కృష్ణమ్మా అనే చిత్రంలో నటించాడు. అంతకుముందు చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో విలన్ గా కనిపించారు. కాగా విజయ్ దేవరకొండ సినిమాలో చేస్తున్నాడు అని వార్తలు వస్తుండటంతో.. ఇందులో ఈ హీరో ది.. పాజిటివ్ పాత్ర లేక విలన్ పాత్ర అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ పాత్ర గురించి సినిమా యూనిట్ అధికారంగా ప్రకటించే వరకు ప్రేక్షకులకు క్లారిటీ రాదు.

Also read: Pan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News